Viveka Murder Case : ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకాని ఎంపీ అవినాష్.. అనుచరులు వెళ్లడంతో..

ABN , First Publish Date - 2023-05-16T16:28:31+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటూనే ఉంది..

Viveka Murder Case : ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకాని ఎంపీ అవినాష్.. అనుచరులు వెళ్లడంతో..

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటూనే ఉంది. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) ఇవాళ సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ కాలేదు. అయితే అత్యవసర పనుల వల్ల విచారణకు హాజరుకాలేనని.. నాలుగు రోజులు గడువు ఇవ్వాలని సీబీఐను (CBI) ఎంపీ కోరారు. ఈ మేరకు ఈమెయిల్ ద్వారా అవినాశ్ లేఖ పంపగా.. తొలుత ఎంపీ విజ్ఞప్తిని తిరస్కరించిన సీబీఐ ఆ తర్వాత ఈనెల 19న మరోసారి విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే ఇవాళ ఎందుకు హాజరుకాలేకపోయారు..? ఇంతకీ ఎమర్జన్సీ పనులేంటనే సంగతి అటుంచితే.. అవినాష్ అనుచరులు మాత్రం సీబీఐ ఎదట హాజరయ్యారు.

CBI.jpg

ఎంపీ వెళ్లలేదు కానీ..!

అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరులుగా చెప్పుకునే నాగేళ్ల విశ్వేశ్వర రెడ్డి (Nagella Visweswar Reddy), వర్రా రవీంద్రా రెడ్డి (Varra Ravindra Reddy) , శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy) లను మంగళవారం మధ్యాహ్నం సీబీఐ విచారణకు (CBI Enquiry) హాజరయ్యారు. మే-16న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని ఈ ముగ్గరికీ సీబీఐ నోటీసులిచ్చింది. అయితే.. ఈ ముగ్గురితో వివేకా హత్య జరిగిన రోజు ఉదయ్ కుమార్ రెడ్డి (Uday Kumar) ఫోన్ సంభాషణలు చేసినట్లు సీబీఐ గుర్తించింది. అయితే.. ఇప్పటికే దీనిపై ఉదయ్‌ను ప్రత్యేకంగా సీబీఐ విచారించింది. అధికారులకు కావాల్సినంత సమాచారం రాబట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ తర్వాత ఈ ముగ్గుర్నీ ఇవాళ విచారణకు సీబీఐ అధికారులు పిలిచారని తెలుస్తోంది. అయితే.. ఎంపీ అనుచరులను (MP Avinash Followers) సీబీఐ ఏమేం ప్రశ్నించనుంది..? ముగ్గురి నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా.. సోమవారం నాడు ఉదయ్ బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలపడంతో ఈ వాదనలతో కోర్టు ఏకీభవించి.. బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.

Avinash-Reddy.jpg

అవినాష్ హాజరై ఉంటే..!

అయితే.. ఇవాళ అవినాష్ కూడా విచారణకు హాజరయ్యి ఉంటే అనుచరులతో కలిపి ఎంపీని విచారించాలని సీబీఐ ఆలోచనలో ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే ఆఖరి నిమిషంలో విచారణకు వెళ్లకుండా ఆగిపోయారని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఇవాళ ఈ ముగ్గురి సుదీర్ఘ విచారణ తర్వాత వీరి దగ్గరి నుంచి రాబట్టిన సమాచారంతో అవినాష్‌ను 19న సీబీఐ విచారించబోతోందని తెలుస్తోంది. అందుకే ఎంపీ నాలుగు రోజులు సమయం అడగ్గానే ఆయన విజ్ఞప్తిని సీబీఐ అంగీకరించినట్లుగా సమాచారం. మొత్తానికి చూస్తే.. అవినాష్ ఇవాళ విచారణకు వెళ్లకపోవడానికి అసలు కారణాలేంటనేది తెలియట్లేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం చిత్ర విచిత్రాలుగా వార్తలొచ్చేస్తున్నాయి. అనుచరుల విచారణ తర్వాత.. అవినాష్ 19 విచారణ తర్వాత ఏం జరుగుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మొత్తం పరిణామాలన్నింటినీ చూస్తే ఈ వారంలో కీలక పరిణామాలు ఉండబోతోందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

******************************

ఇవి కూడా చదవండి..

******************************
Karnataka Results : అరెరే.. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి ఏరికోరి మరీ బ్రహ్మానందంను తెచ్చుకుంటే..!

******************************

DK Vs Sidda For CM Chair : ఢిల్లీ వెళ్లకముందే.. ప్రెస్‌మీట్ పెట్టి మరీ బాంబ్ పేల్చిన డీకే శివకుమార్.. ఈ ఒక్క మాటతో..

******************************

Updated Date - 2023-05-16T16:34:17+05:30 IST