YuvaGalam@200: యువగళం ప్రజాగళం అయ్యింది.. లోకేశ్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2023-08-31T09:52:41+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా ముందుకుసాగుతోంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ప్రభుత్వం సృష్టించిన ఎన్నో ఆటంకాలను ఎదుర్కుంటూ.. ప్రజల ఆశీర్వాదాలతో నేటికి 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యువనేతకు టీడీపీ అధ్యిక్షులు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.

YuvaGalam@200: యువగళం ప్రజాగళం అయ్యింది.. లోకేశ్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) దిగ్విజయంగా ముందుకుసాగుతోంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ప్రభుత్వం సృష్టించిన ఎన్నో ఆటంకాలను ఎదుర్కుంటూ.. ప్రజల ఆశీర్వాదాలతో నేటికి 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యువనేతకు టీడీపీ అధ్యిక్షులు చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలియజేశారు. యువగళం ప్రజాగళం అయ్యింది అంటూ టీడీపీ అధినేత అభినందించారు.


ఇప్పటి వరకు యువగళం సాగిందిలా....

లోకేశ్ యువగళం పాదయాత్ర 200వ రోజుకు చేరుకుంది. కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభమవగా.. ఇప్పటి వరకు 77 నియోజకవర్గాల్లో 2710 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. మొత్తం 185 మండలాలు, మున్సిపాలిటీలు, 1675 గ్రామాల మీదుగా లోకేశ్ పాదయాత్ర చేశారు. రోజుకు సగటున 13.5కి.మీ మేర పాదయాత్ర సాగుతోంది. యువగళం ద్వారా 64 బహిరంగసభలు, 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో యువనేత పాల్గొన్నారు. రాయలసీమలో 124 రోజుల పాటు 44 అసెంబ్లీ నియోజకర్గాల మీదుగా 1587 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది.

  • ఉమ్మడి చిత్తూరు జిల్లాలో – 14 నియోజకవర్గాలు – 45రోజులు – 577 కి.మీ. మేర లోకేష్ పాదయాత్ర

  • ఉమ్మడి అనంతపురం జిల్లాలో – 9 నియోజకవర్గాలు – 23రోజులు – 303 కి.మీ. మేర పాదయాత్ర

  • ఉమ్మడి కర్నూలులో – 14 నియోజకవర్గాలు – 40రోజులు – 507 కి.మీ. మేర పాదయాత్ర

  • ఉమ్మడి కడప జిల్లాలో – 7 నియోజకవర్గాలు – 16రోజులు – 200 కి.మీ. మేర సాగిన పాదయాత్ర

  • ఉమ్మడి నెల్లూరు – 10 నియోజకవర్గాలు – 31రోజులు – 459 కి.మీ.

  • ఉమ్మడి ప్రకాశం – 8 నియోజకవర్గాలు – 17రోజులు – 220 కి.మీ

  • ఉమ్మడి గుంటూరు – 7 నియోజకవర్గాలు – 16రోజులు – 236 కి.మీ

  • ఉమ్మడి కృష్ణా జిల్లా – 6 నియోజకవర్గాలు – 8రోజులు – 113 కి.మీ.లు

  • ఉమ్మడి పశ్చిమ గోదావరి – 2 నియోజకవర్గాలు – 4రోజులు – 80 కి.మీ.

Updated Date - 2023-08-31T09:52:41+05:30 IST