Home loan interest rates: తక్కువ వడ్డీతో గృహరుణాలు ఆఫర్ చేస్తున్న టాప్-5 బ్యాంకులు ఇవే..!

ABN , First Publish Date - 2023-07-12T19:57:21+05:30 IST

తక్కువ వడ్డీ రుణం ఎక్కడ లభిస్తే ఆయా బ్యాంకులు లేదా సంస్థలకు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా భారీ మొత్తంలో తీసుకునే గృహరుణాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆరా తీసి మరీ తక్కువ వడ్డీ అందించే బ్యాంకుల వైపే మొగ్గుచూపుతారు. అయితే అత్యధిక బ్యాంకులు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటుతోనే (floating Interest rate) లోన్లు అందిస్తున్నాయి.

Home loan interest rates: తక్కువ వడ్డీతో గృహరుణాలు ఆఫర్ చేస్తున్న టాప్-5 బ్యాంకులు ఇవే..!

న్యూఢిల్లీ: తక్కువ వడ్డీ రుణం ఎక్కడ లభిస్తే ఆయా బ్యాంకులు లేదా సంస్థలకు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా భారీ మొత్తంలో తీసుకునే గృహరుణాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆరా తీసి మరీ తక్కువ వడ్డీ అందించే బ్యాంకుల వైపే మొగ్గుచూపుతారు. అయితే అత్యధిక బ్యాంకులు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేటుతోనే (floating Interest rate) లోన్లు అందిస్తున్నాయి. ఫిక్స్‌డ్ వడ్డీ రేటు మాదిరిగా కాకుండా... రెపో రేటు విషయంలో ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా వడ్డీ రేట్లు మారుతుంటాయి. ఆర్బీఐ నిర్ణయాన్ని బట్టి వడ్డీ రేటు పెరుగుదల లేదా తగ్గుదల ఆధారపడి ఉంటుంది. ఇక ప్రామాణిక వడ్డీ రేటుకు అదనంగా రుణగ్రహీతలపై మార్జిన్ ప్లస్ రిస్క్ ప్రీమియం విధింపునకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి కూడా ఇచ్చింది. ఇక సిబిల్ స్కోర్, లోన్ మొత్తం, కాలపరిమితి, ఆదాయం వంటి ఇతర కారణాలు కూడా గృహరుణాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా 3 - 30 ఏళ్ల మధ్య రుణం కాలపరిమితిని బట్టి రేట్లు మారుతుంటాయి.

ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం జులై 6, 2023 నాటికి తక్కువ వడ్డీతో గృహ రుణాలు అందిస్తున్న టాప్-5 బ్యాంకులు ఇవే..

బ్యాంకు పేరు కనీస వడ్డీ గరిష్ట వడ్డీ

1. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 8.45% 9.85 %

2. ఇండస్‌ఇండ్ 8.5% 9.75%

3. ఇండియన్ బ్యాంక్ 8.5% 9.9%

4. పీఎన్‌బీ 8.6% 9.45%

5. మహారాష్ట్ర బ్యాంక్ 8.6% 10.3%.

Updated Date - 2023-07-12T19:57:41+05:30 IST