Share News

Airtel: సిమ్ కార్డ్ బదులు ఈ -సిమ్‌ వాడాలన్న ఎయిర్‌టెల్ సీఈవో.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-11-22T13:06:17+05:30 IST

Mumbai: ఎయిర్ టెల్(Airtel) యూజర్స్ సిమ్ కార్డులకు బదులు ఈ - సిమ్( e-SIM)లు వాడాలని ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్(Gopal Vittal) సూచించారు.

Airtel: సిమ్ కార్డ్ బదులు ఈ -సిమ్‌ వాడాలన్న ఎయిర్‌టెల్ సీఈవో.. ఎందుకంటే?

ఢిల్లీ: ఎయిర్ టెల్(Airtel) యూజర్స్ సిమ్ కార్డులకు బదులు ఈ - సిమ్( e-SIM)లు వాడాలని ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్(Gopal Vittal) సూచించారు. యూజర్లు మెరుగైన అనుభవం, భద్రత, ప్రయోజనాలు పొందడానికి ఈ - సిమ్ లు దోహదపడతాయని వివరించారు.

ఆయన మాట్లాడుతూ.. "సిమ్ కార్డులను ఈ సిమ్ లుగా మార్చుకోండి. ఇవి నేరుగా ఫోన్‌లో విలీనం చేసి ఉంటాయి. అతుకులు లేని కనెక్టివిటీ, మెరుగైన భద్రతకు ఇవి ఉపయోగపడతాయి. ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్(Airtel Thanks App) ద్వారా ఈ సిమ్ లలోకి మారిపోవచ్చు" అని అన్నారు.


ఈ - సిమ్‌లంటే..

ఇవి సిమ్ కార్డుల్లాగా ఉంటాయి. కానీ కంటికి కనిపించవు. ఫోన్లోనే ఇన్ బిల్ట్ గా వస్తాయి. ఇవి ఆటోమెటిక్ గా పని చేయడానికి ఫోన్లో ప్రత్యేక సాఫ్ట్ వేర్‌ని ఉపయోగిస్తారు. అయితే డైరెక్ట్ కనెక్షన్ గా ఉండటం వల్ల.. ఈ సిమ్‌తో కొత్త ఫోన్‌కి మారడం కొంచం కష్టంగా ఉంటుంది.

విట్టల్ ఎయిర్ టెల్ కస్టమర్లకు ఓ మెయిల్ పంపారు. "ఫోన్లు చోరీకి గురైతే సాధారణ సిమ్ములు తీసే ఛాన్స్ ఉంటుంది. తద్వారా ఫోన్ ని ట్రాక్ చేయడం కష్టం అవుతంది. కానీ ఈ - సిమ్ లతో ఫోన్ ఎక్కడ ఉన్నా ఈజీగా కనిపెట్టేయొచ్చు" అని మెయిల్ లో ఉంది. ఈ సిమ్ లకు సపోర్ట్ చేసే ఏ మొబైల్ లోనైనా వీటిని ఉపయోగించవచ్చని విట్టల్ తెలిపారు. సిమ్‌లు మార్చడానికి ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ లోకి వెళ్లి చేసుకోవచ్చని సూచించారు. Samsung, Motorola, OnePlus వంటి అనేక ఫోన్ బ్రాండ్‌లు e-SIMలతో పనిచేసే ఫోన్‌లను తయారు చేయడం ప్రారంభించాయి. ఇప్పటికే ఐఫోన్ సైతం ఒకేసారి రెండు ఈ సిమ్ లు వాడే బ్రాండ్లు తయారుచేస్తున్నాయి.

Updated Date - 2023-11-22T13:15:16+05:30 IST