Amazon: మే నుంచి వారానికి 3రోజులు వర్క్ ఫ్రం ఆఫీస్...అమెజాన్ ప్రకటన
ABN , First Publish Date - 2023-02-18T07:45:59+05:30 IST
ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది....
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.(Amazon) ఈ ఏడాది మే నెల నుంచి వారానికి కనీసం మూడు రోజులు(3 Days) ఆఫీసు(Work From Office) నుంచి పనిచేయాలని ప్రకటించింది.అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ ఈ మేరకు తాజాగా జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి వల్ల వర్క్ ఫ్రం హోంకు అనుమతించిన కంపెనీ తాజాగా వర్క్ ఫ్రం ఆఫీసు అంటూ ప్రకటించింది.(Announce)
కరోనా లాక్ డౌన్లు సడలించినా, అమెజాన్ ఉద్యోగులు ఇంకా వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. తమ ఉద్యోగులు ప్రధాన నగరాల్లోని కార్యాలయాలకు వస్తే మా వ్యాపారానికి ప్రోత్సాహం లభిస్తుందని అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆండీ జాస్సీ అమెజాన్ బ్లాగ్‌లో పోస్ట్ చేసిన సందేశంలో పేర్కొన్నారు. అయితే వర్క్ ఫ్రం ఆఫీసు నియమానికి మినహాయింపులు ఇస్తూ...కస్టమర్ సపోర్ట్ రోల్స్,సేల్‌స్పీపుల్ రిమోట్‌గా పని చేసే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి :Viral Video: సినీ నటుడిని బలవంతంగా ముద్దాడబోయిన మహిళా అభిమాని...ఆపై ఏం జరిగిందంటే...
ఈ ఏడాది జనవరిలో అమెజాన్ యునైటెడ్ స్టేట్స్, కెనడా, కోస్టా రికాలో ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన సిబ్బందికి మెమోలో తెలిపింది.గత కొన్ని నెలలుగా తొలగింపులు, ఉద్యోగాల కోతలను ప్రకటించిన పలు టెక్ కంపెనీలలో అమెజాన్ ఒకటి.