I Have Space Amazon: యువకులకు వరంలా మారిన అమెజాన్ ‘ఐ హ్యావ్ స్పేస్’

ABN , First Publish Date - 2023-04-28T19:49:12+05:30 IST

జీవితంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కోవాలన్నా, కష్టాలను అవకాశంగా

I Have Space Amazon: యువకులకు వరంలా మారిన అమెజాన్ ‘ఐ హ్యావ్ స్పేస్’

హైదరాబాద్: జీవితంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కోవాలన్నా, కష్టాలను అవకాశంగా మలచుకోవాలన్నా అందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న హైదరాబాద్‌కు చెందిన 35 ఏళ్ల నరేష్ తోట్ల ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అమెజాన్ 2015లో ప్రారంభించిన ‘ఐ హ్యావ్ స్పేస్’ (IHS) ప్రోగ్రాంలో చేరిన అతికొద్దిమంది నరేష్ ఒకరు. 2007లో టెన్త్ పూర్తి చేసిన నరేష్ ఆర్థిక కష్టాల కారణంగా ఆపై చదవలేకపోయారు. ఆపై జీవితంలో స్థిరపడేందుకు 8 ఏళ్లపాటు ఎన్నో కష్టాలు పడ్డారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో జులై 2015లో ‘హార్ధిక్ మొబల్స్’ను ప్రారంభించారు. మొబైల్స్, సిమ్‌ కార్డులు విక్రయించే వారు. అయితే, అది ఏమూలకు సరిపోయేది కాదు.

ఈ క్రమంలో అమెజాన్ ప్రారంభించిన ‘ఐ హ్యావ్ స్పేస్’ ప్రోగ్రాం గురించి తెలిసి అందులో చేరారు. అప్పట్లో హైదరాబాద్ నుంచి ఈ ప్రోగ్రాంలో చేరిన తొలి భాగస్వామి ఆయన ఒక్కరే. ఆ తర్వాత తన ఖాళీ సమయంలో అమెజాన్ వినియోగదారులకు ప్యాకేజీలను డెలివరీ చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించేవారు. ఈ సంపాదన ఆయన వ్యాపార వృద్ధికి కూడా తోడ్పడింది. మరింత కాలంపాటు ఇందులో కొనసాగుతూ అమెజాన్ వినియోగదారులకు చిరునవ్వులు అందించాలని భావిస్తున్నట్టు నరేష్ చెప్పారు.

అమెజాన్ లాజిస్టిక్స్ ఇండియా డైరెక్టర్ కరుణ శంకర పాండే మాట్లాడుతూ.. వివిధ రంగాలకు చెందిన యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అమెజాన్ ఇండియా కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. నరేష్ వంటి యువకులు ఐ హ్యావ్ స్పేస్ ప్రోగ్రామ్ నుంచి ఎంతో ప్రయోజనం పొందడంతో పాటు అది అందించే అదనపు ఆదాయ అవకాశాలను చూడడం సంతృప్తికరంగా ఉందన్నారు.

ఐ హ్యావ్ స్పేస్ ప్రోగ్రాం భాగస్వాములు రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల పరిధిలో వినియోగదారులకు ఉత్పత్తులను డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు http://www.amazon.in/ihలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated Date - 2023-04-28T19:49:12+05:30 IST