తరిగిపోతున్న ఆదాయాలు

ABN , First Publish Date - 2023-01-30T02:00:54+05:30 IST

దేశ ఆర్థిక పరిస్థితులపై ప్రజల నమ్మకం సన్నగిల్లుతోంది. లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో 60 శాతం కుటుంబాలు తమ..

తరిగిపోతున్న ఆదాయాలు

లోకల్‌ సర్కిల్స్‌ సర్వే

బడ్జెట్‌పైనే ప్రజల ఆశలు

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితులపై ప్రజల నమ్మకం సన్నగిల్లుతోంది. లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో 60 శాతం కుటుంబాలు తమ ఆదాయా లు, పొదుపు 10 నుంచి 25 శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్ను పోటు తగ్గించడంతో పాటు పన్ను మినహాయింపుల పరిమితి మరింత పెంచాలని కోరారు. గత ఏడాది నవంబరు 25 నుంచి ఈ నెల 25 వరకు దేశంలోని 309 జిల్లాల్లో 37,000 మంది అభిప్రాయాలతో ఈ సంస్థ ఈ సర్వే నివేదిక రూపొందించింది. ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి మరో ఆరు నెలల నుంచి ఏడాది వరకు కొనసాగే అవకాశం ఉందని 52 శాతం మంది చెప్పారు.

కొలువుల కోతలు, కొత్త ఉద్యోగాలు తరిగిపోవడంపైనా చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. సర్వేలో పాల్గొన్న 56 శాతం కుటుంబాలైతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022 -23) తమ పొదుపు పడిపోతుందని చెప్పారు. కేవలం 19 శాతం మాత్రమే పెరిగే అవకాశం ఉందన్నారు.

Updated Date - 2023-01-30T13:05:57+05:30 IST