Home » Union Budget
MP Lavu Sri Krishna Devarayalu: పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.12 వేలు కోట్లు మాత్రమే ఇచ్చారు కొందరు అంటున్నారని.. అయితే గత పాలనలో అసలు అభివృద్ధి జరగలేదని.. అది ముందు ఆలోచించాలంటూ వైసీపీ నేతలను పరోక్షంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు చురకలంటించారు. అలాగే కేంద్రం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తుందో ఆయన వివరించారు. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలను గణాంకాలతో సహా ఆయన తెలిపారు.
కేంద్రబడ్జెట్లో రైల్వేకు సంబంధించి తెలంగాణకు రూ.5,337 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ కేటాయింపులు యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రతీ ఏట కేటాయించినదాని కంటే 6 రెట్లు ఎక్కువని అన్నారు.
Budget 2025: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అద్భుతమని.. తాను అస్సలు ఊహించలేదన్నారు.
కేంద్ర బడ్జెట్లో గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad)కు నిరాశే ఎదురైంది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు రూ.4వేల కోట్లు, మురుగు సీవరేజ్ నిర్వహణ మాస్టర్ ప్లాన్ కోసం రూ.17,212 కోట్లు కోరితే రూపాయి కూడా విదల్చలేదు. మెట్రో రెండో దశ డీపీఆర్‌కు అనుమతి ఇచ్చి రూ.24,269 కోట్లలో తనవంతు వాటా 18 శాతం నిధుల ఊసెత్తలేదు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా ఆదివారం ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాను నిర్వహించనుంది.
కేంద్ర బడ్జెట్ తెలంగాణ హక్కులను, ఆకాంక్షలను కాలరాసిందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆక్షేపించిం ది. రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి అంశాలను పట్టించుకోలేదని విమర్శించింది.
నరేంద్ర మోదీ గత పదేళ్ల పాలనలో మధ్యతరగతి ప్రజానీకం నుంచి రూ.54.18 లక్షల కోట్లు ఆదాయం పన్ను రూపంలో వసూలు చేసిందని, ఇప్పుడు రూ.12 లక్షల వరకూ పన్ను మినహాయింపు ప్రకటించి ఏడాదికి రూ.80,000 ఆదా అవుతుందని ఆర్థిక మంత్రి చెబుతున్నారని ఖర్గే అన్నారు.
నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌తో ఆర్థిక వృద్ధి పాతబాటలోనే నడక సాగిస్తుందని, 6 నుంచి 6.5 శాతానికి మించదని ఆయన జోస్యం చెప్పారు. ఆర్థిక వృద్ధిపై సీఏఈ 8 శాతం అంచనాలను చేరుకోలేదన్నారు.
యూనియన్ బడ్జెట్ 2025-26లో అత్యధిక కేటాయింపులు ఏ రంగానికి, ఏ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించారు. మొత్తంమీద ఇవాల్టి బడ్జెట్లో హైలెట్స్ ఆంధ్రజ్యోతి లైవ్ అప్డెట్స్లో చూడండి.
కేంద్ర కేబినెట్ 2019 డిసెంబర్ 24న జరిపిన సమావేశంలో రూ.8,754 కోట్ల వ్యయంతో 2021లో జనాభా లెక్కల సేకరణ, రూ.3,941.35 కోట్లతో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అప్డేషన్ చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఆ ప్రక్రియ జరగాల్సి ఉంది.