Sovereign Gold Bonds: గోల్డ్ బాండ్స్‌పై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం..
ABN , Publish Date - Dec 15 , 2023 | 06:14 PM
మీరు గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్ సిరీస్ IIIని విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మూడో సారి విడుదల కానున్న ఈ స్కీమ్ సోమవారం (డిసెంబర్ 18) నుంచి ప్రారంభమవుతుంది.
మీరు గోల్డ్ బాండ్స్‌లో (Sovereign Gold Bonds) పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్ సిరీస్ IIIని (SGB III) విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మూడో సారి విడుదల కానున్న ఈ స్కీమ్ సోమవారం (డిసెంబర్ 18) నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 22న ముగుస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే బంగారు ధరలు (Gold Price) 10 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌కు ఆదరణ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. నాలుగో సిరీస్ ఫిబ్రవరిలో ఉంటుంది.
ఈ బాండ్లలో గ్రాము నుంచి గరిష్టంగా 4 కేజీల వరకు బంగారం కొనొచ్చు. 8 సంవత్సరాల కాల పరిమితితో ఉండే ఈ బాండ్లపై 2.50 శాతం స్థిర వడ్డీ లభిస్తుంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ద్వారా గ్రాము గోల్డ్‌పై రూ. 50 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. గోల్డ్ బాండ్లపై గ్రాము ధరను ఇండియన్ బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్ (IBJA) నిర్ణయిస్తుంటుంది. బాండ్ల జారీ తేదీ ముందు వారంలో చివరి 3 రోజుల బంగారం సగటు ధరను బట్టి ఈ వీటి రేటు ఉంటుంది. ఈ సిరీస్ బాండ్లను కొనుగోలు చేసిన వారికి డిసెంబర్ 28న గోల్డ్ బాండ్లు జారీ అవుతాయి.
ఈ గోల్డ్ బాండ్లను నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే నేరుగా బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో, స్టాక్ ఎక్స్చేంజీల్లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. కాగా, నాలుగో సిరీస్ స్కీమ్‌ను కూడా ఆర్బీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12-16 మధ్య నాలుగో సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్ IV ఉండబోతోంది.