Layoff: ఈబేలో లేఆఫ్...500 మంది ఉద్యోగుల తొలగింపు

ABN , First Publish Date - 2023-02-08T08:00:06+05:30 IST

ప్రముఖ ఈకామర్స్ కంపెనీ ఈబే కూడా తాజాగా లేఆఫ్ ప్రకటించింది....

Layoff: ఈబేలో లేఆఫ్...500 మంది ఉద్యోగుల తొలగింపు
EBay Layoff

కాలిఫోర్నియా: ప్రముఖ ఈకామర్స్ కంపెనీ ఈబే కూడా తాజాగా లేఆఫ్ ప్రకటించింది.(EBay Layoff) ఈబే ఈకామర్స్ కంపెనీ 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.కరోనా మహమ్మారి తర్వాత అమ్మకాలు తగ్గడంతో(Declining sales) 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఈబే(E commerce Company) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జామీ ఇయానోన్ (Chief Executive Officer Jamie Iannone)మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో 4 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈఓ జామీ ఇయానోస్ చెప్పారు.

ఇది కూడా చదవండి: Pakistan: పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం...30మంది దుర్మరణం

డెల్ కంపెనీ కూడా తాజాగా 6,600 ఉద్యోగాలను తగ్గించింది. అమ్మకాలు క్షీణించి ఆదాయం తగ్గడంతో ఉద్యోగుల తొలగింపు తప్పలేదని కంపెనీ తెలిపింది. మరో దిగ్గజ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ 18వేల మంది ఉద్యోగులను తొలగించింది. మరో వైపు ఆన్ లైన్ గృహోపకరణాల రిటైల్ కంపెనీ 1750 మంది ఉద్యోగులను తొలగించింది. వరుసగా ఉద్యోగాల తొలగింపులతో యువతీ, యువకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-02-08T08:00:09+05:30 IST