Gold and Silver Price : ఊహించని స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు

ABN , First Publish Date - 2023-07-20T08:58:17+05:30 IST

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు సర్వసాధారణం. కానీ ఇటీవలి కాలంలో.. ముఖ్యంగా ఈ నెలలో బంగారం ఎందుకోగానీ ఎక్కువ శాతం స్థిరంగానే ఉంటూ వస్తోంది. నేడు మాత్రం దుమ్ము దులిపింది. ఊహించని స్థాయిలో పెరిగింది. గత రెండు నెలల్లో పెరగనంతగా పెరిగి షాక్ ఇచ్చింది.

Gold and Silver Price : ఊహించని స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Price : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు సర్వసాధారణం. కానీ ఇటీవలి కాలంలో.. ముఖ్యంగా ఈ నెలలో బంగారం ఎందుకోగానీ ఎక్కువ శాతం స్థిరంగానే ఉంటూ వస్తోంది. నేడు మాత్రం దుమ్ము దులిపింది. ఊహించని స్థాయిలో పెరిగింది. గత రెండు నెలల్లో పెరగనంతగా పెరిగి షాక్ ఇచ్చింది. ఈ రెండు నెలల్లో హయ్యస్ట్‌గా పెరిగితే రూ.150 కి మించి పెరిగిందైతే లేదు. నేడు బంగారం ధర (10 గ్రాములు) ఏకంగా రూ.550 పెరిగింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.500 పెరిగి రూ.55,600కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.550 పెరగ్గా.. రూ.60,650కి చేరుకుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే కిలోపై రూ.400 పెరిగి రూ.78,400కు చేరుకుంది. నేడు దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,650

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,650

విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,650

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,980

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,650

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,650

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,650

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,650

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,800

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.82,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.82,000

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.82,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.82,000

కేరళలో కిలో వెండి ధర రూ.82,000

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.77,850

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.78,400

ముంబైలో కిలో వెండి ధర రూ.78,400

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,400

Updated Date - 2023-07-20T08:58:17+05:30 IST