Gold and Silver Price : పెరిగిన బంగారం, వెండి ధరలు
ABN , First Publish Date - 2023-08-22T10:42:26+05:30 IST
బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. అయితే దాదాపు రెండు నెలలుగా బంగారం ధర స్థిరంగా ఉండటమో లేదంటే తగ్గడమో జరుగుతున్నాయి తప్ప పెరిగిందైతే పెద్దగా లేదనే చెప్పాలి. అలాంటిది నేడు తులం బంగారంపై ఏకంగా రూ.60 మేర పెరిగి షాక్ ఇచ్చింది.
Gold and Silver Price : బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మార్పులు చేర్పులకు గురవుతుంటాయన్న విషయం తెలిసిందే. అయితే దాదాపు రెండు నెలలుగా బంగారం ధర స్థిరంగా ఉండటమో లేదంటే తగ్గడమో జరుగుతున్నాయి తప్ప పెరిగిందైతే పెద్దగా లేదనే చెప్పాలి. అలాంటిది నేడు తులం బంగారంపై ఏకంగా రూ.60 మేర పెరిగి షాక్ ఇచ్చింది. ఇది ఒక పెరుగుదల అని అయితే అనలేం కానీ ఒకసారి పెరిగిందంటే మాత్రం ఇక పెరుగుతూనే ఉంటుంది. అసలే శ్రావణ మాసం.. బంగారానికి డిమాండ్ భారీగా పెరిగే సమయం కావడంతో ఇది కొనుగోలుదారులకు కాస్త ఇబ్బందికర పరిణామమే. ఇక నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.50 పెరిగి రూ.54,200కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.60 పెరిగి రూ. 59,130కి చేరుకుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. నేడు కిలో ధరపై రూ.200 పెరిగి రూ.73,500కి చేరుకుంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,130
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,130
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,200.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,130
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,500
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,300.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,220
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,700
విజయవాడలో కిలో వెండి ధర రూ.76,700
విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.76,700
చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700
కేరళలో కిలో వెండి ధర రూ.75,700
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.72,500
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.73,500
ముంబైలో కిలో వెండి ధర రూ.73,500
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,500