Jobs Cuts: గోల్డ్‌మన్ సాచ్స్ కంపెనీలో 3,200 ఉద్యోగుల తొలగింపు
ABN , First Publish Date - 2023-01-09T07:54:49+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం వల్ల పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి....
బ్లూమ్‌బర్గ్ : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం వల్ల పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి.(Jobs Cuts) తాజాగా గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ఈ వారంలో దాదాపు 3,200 స్థానాలను తొలగించనుంది.(Goldman Sachs) కోర్ ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్ల నుంచి ఉద్యోగులను తొలగించనున్నట్లు గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ప్రకటించింది.(Jobs Cuts this week) న్యూయార్క్‌కు చెందిన గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ కంపెనీ ప్రతినిధి ఉద్యోగుల తొలగింపులపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ సోలమన్ ఆధ్వర్యంలో 2018 చివరి నుంచి 34శాతం ఉద్యోగుల సంఖ్య పెరిగింది. వ్యాపారంలో మందగమనం, అనిశ్చిత దృక్పథంతో బ్యాంకు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోత విధించింది. అస్థిర గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల ఫలితంగా సంస్థాగత బ్యాంకులు కార్పొరేట్ డీల్స్‌లో పెద్ద మందగమనాన్ని చవిచూశాయి.