NPCI: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యూజర్లకు అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
ABN , Publish Date - Dec 30 , 2023 | 06:58 PM
NPCI: ప్రతిరోజూ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్‌ల ద్వారా నగదు లావాదేవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ యాప్‌లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 నాటికి ఏడాదికి పైగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న UPI ఐడీలను డీయాక్టివేట్ చేయాలని చెల్లింపు యాప్‌లను ఆదేశించింది.
ప్రస్తుతం దేశంలో చాలా మంది ఆన్‌లైన్ లావాదేవీలను వాడుతున్నారు. ప్రతిరోజూ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్‌ల ద్వారా నగదు లావాదేవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ యాప్‌లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 నాటికి ఏడాదికి పైగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న UPI ఐడీలను డీయాక్టివేట్ చేయాలని చెల్లింపు యాప్‌లను ఆదేశించింది. కొందరు కస్టమర్లు బ్యాంకు అకౌంట్లతో లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ల స్థానంలో కొత్త సిమ్‌లను తీసుకుంటున్నారని.. ఆ పాత నంబర్లను మూడు నెలల తర్వాత టెలికాం కంపెనీలు కొత్త వాళ్లకు కేటాయించినప్పుడు నగదు బదిలీ సమస్యలు వస్తున్నాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ గుర్తించింది. ఈ సమస్యను నివారించేందుకు వీలుగా చెల్లింపు యాప్‌లు ఇన్‌యాక్టివ్ యూపీఐ ఐడీలను తొలగిస్తే అక్రమ నగదు బదిలీలు నిరోధించడం తేలిక అవుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) అభిప్రాయపడింది.
కాగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్స్ ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పాపులారిటీ సాధిస్తున్నాయి.ఆన్‌లైన్ పేమెంట్స్ చేయడానికి యూపీఐ చాలా ఈజీ మార్గంగా మారింది. యూపీఐతో బ్యాంక్ అకౌంట్‌ను ఫోన్ నంబర్ లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA)కి లింక్ చేసుకోవచ్చు. యూపీఐ ఉపయోగించి డబ్బు పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రముఖ యాప్‌లను ఉపయోగించవచ్చు. రాను రాను UPI పేమెంట్స్ చేసేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిత్యం కోట్లాది రూపాయలు ఈ పేమెంట్స్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంగా ఎలాంటి లావాదేవీలు చేయని యూపీఐ ఐడీలను ఇనాక్టివ్ ఐడీలుగా పరిగణిస్తూ డిసెంబర్ 31లోపు డీయాక్టివేట్ చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ పేమెంట్ అప్లికేషన్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇన్‌యాక్టివ్ ఐడీలను పలు యాప్స్ తొలగించనున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి