Threads: మార్క్ జుకర్‌బర్గ్ థ్రెడ్స్ ట్రెండింగ్ తర్వాత ట్విట్టర్‌లో మీమ్స్ హల్‌చల్..

ABN , First Publish Date - 2023-07-06T16:19:42+05:30 IST

‘థ్రెడ్స్’(Threads) మెటా సంస్థ నూతన ఆవిష్కరణ. సోషల్ మీడియాలో ఇప్పుడు దీని గురించే చర్చ. మార్క్ జుకెన్ బర్గ్ ‘థ్రెడ్స్’ యాప్‌ను ట్విట్టర్ ప్రత్యర్థిగా భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ కొనసాగింపుగా జుకెన్‌బర్గ్ ఈ యాప్‌ను తీసుకొచ్చాడు. థ్రెడ్స్‌ చాలావరకు ట్విట్టర్‌లో ఉన్న ఫీచర్లను కలిగిన స్వతంత్ర ఫ్లాట్‌ఫారమ్. అయితే థ్రెడ్స్ లాంచింగ్‌తో ట్విట్టర్‌లో భిన్న అభిప్రాయాలతో మీమ్స్ పరంపర కొనసాగుతోంది. అవేంటో చూద్దాం.

Threads: మార్క్ జుకర్‌బర్గ్ థ్రెడ్స్ ట్రెండింగ్ తర్వాత ట్విట్టర్‌లో మీమ్స్ హల్‌చల్..

‘థ్రెడ్స్’(Threads) మెటా సంస్థ నూతన ఆవిష్కరణ. సోషల్ మీడియాలో ఇప్పుడు దీని గురించే చర్చ. మార్క్ జుకర్ బర్గ్ ‘థ్రెడ్స్’ యాప్‌ను ట్విట్టర్ ప్రత్యర్థిగా(Twitter Rival) భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్(Instagram) కొనసాగింపుగా జుకెన్‌బర్గ్(Mark Zuckerberg) ఈ యాప్‌ను తీసుకొచ్చాడు. థ్రెడ్స్‌ చాలావరకు ట్విట్టర్‌లో ఉన్న ఫీచర్లను కలిగిన స్వతంత్ర ఫ్లాట్‌ఫారమ్. అయితే థ్రెడ్స్ లాంచింగ్‌తో ట్విట్టర్‌లో భిన్న అభిప్రాయాలతో మీమ్స్ పరంపర కొనసాగుతోంది. అవేంటో చూద్దాం.

కాగా.. మార్క్ జుకర్ బర్గ్ ట్విట్టర్ కిల్లర్ యాప్ ‘థ్రెడ్స్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే 10 మిలియన్ల మందికి పైగా వినియోగదారులను సంపాదించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా జుకెన్ బర్గ్ కొత్త ఫ్లాట్‌ఫారమ్‌ థ్రెడ్స్‌లో తెలిపాడు. అయితే 11 ఏళ్ల తర్వాత తొలిసారి ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్‌ను ఉద్దేశించి పోస్ట్ చేశాడు. తన కొత్త ఫ్లాట్‌ఫారమ్ 450 మిలియన్ వినియోగదారులున్న ట్విట్టర్‌కంటే ఎక్కువ మంది యూజర్లను పొందుతుందని గర్వంగా ప్రకటించాడు.

Updated Date - 2023-07-06T16:41:43+05:30 IST