iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్‌ ఫోన్లలో కొత్త మార్పులేంటి? అసలు యాక్షన్ బటన్ పనితనం ఏంటి?

ABN , First Publish Date - 2023-09-13T15:06:44+05:30 IST

ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. ఐఫోన్ 15 సిరీస్‌లోని కొత్త ఫోన్లు మంగళవారం లాంచ్ అయ్యాయి. కాలిఫోర్నియాలోని తన హెడ్ క్వార్టర్స్‌లో వండర్‌లస్ట్ పేరిట నిర్వహించిన..

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్‌ ఫోన్లలో కొత్త మార్పులేంటి? అసలు యాక్షన్ బటన్ పనితనం ఏంటి?

ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. ఐఫోన్ 15 సిరీస్‌లోని కొత్త ఫోన్లు మంగళవారం లాంచ్ అయ్యాయి. కాలిఫోర్నియాలోని తన హెడ్ క్వార్టర్స్‌లో వండర్‌లస్ట్ పేరిట నిర్వహించిన ఈవెంట్‌లో భాగంగా.. యాపిల్ సంస్థ ఐఫోన్ 15 సిరీస్ మొబైల్ ఫోన్స్‌తో పాటు వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మిగతా వాటి సంగతి పక్కన పెడితే.. ముందుగా ఊహించినట్లుగానే ఈసారి ఐఫోన్లలో యాపిల్ సంస్థ కొన్ని కీలక మార్పులు చేసింది. యాక్షన్ బటన్ అనే సరికొత్త ఫీచర్‌ని కూడా అందుబాటులోకి తెచ్చింది. పదండి, ఈ యాక్షన్ బటన్ పనితనంతో పాటు కొత్త మార్పులేంటో తెలుసుకుందాం..

* టైటానియం డిజైన్‌: దీనివల్ల ఫోన్‌ బరువు చాలా వరకు తగ్గుతుంది.

* కెమెరా అప్‌గ్రేడ్‌: ఇప్పటి వరకు 12MP మెయిన్‌ సెన్సర్‌ కెమెరాను ఇస్తూ వచ్చిన యాపిల్ సంస్థ.. ఈసారి ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌లో 48MP కెమెరాను అమర్చింది.

* ప్రాసెసర్‌: ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌ మోడల్స్‌లో మునుపటిలాగే ఏ16 బయోనిక్‌ ప్రాసెసర్‌ను ఇవ్వగా.. ప్రో మోడల్స్‌కు ఏ17 ప్రాసెసర్‌ను రిజర్వ్‌ చేశారు. దీని వల్ల ఫోన్లు 7 రెట్లు వేగంగా పని చేస్తాయని నిపుణులు చెప్తున్నారు.

* ఫ్రాస్టెడ్‌ గ్లాస్‌ బ్యాక్‌ ప్యానెల్‌: గతంలో ప్రో మోడల్స్‌కు మాత్రమే ఫ్రాస్టెడ్‌ గ్లాస్‌ బ్యాక్‌ ప్యానెల్‌ను ఇవ్వగా.. ఈసారి ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌లోనూ ఇచ్చారు. దీంతో లుక్ ప్రీమియంగా ఉంటుంది.

* డైనమిక్‌ ఐలాండ్‌: ఇంతకుముందు 14 ప్రో మోడల్స్‌లో మాత్రమే ఈ ఫీచర్ ఇవ్వగా.. ఈసారి ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌లో కూడా దీన్ని జత చేసింది.

* యూఎస్‌బీ టైప్‌-సీ: 2012 నుంచి యాపిల్‌ సంస్థ లైటెనింగ్‌ పోర్ట్‌తో ప్రత్యేక ఛార్జింగ్‌ బ్రిక్‌, కేబుల్‌ను ఇస్తూ వస్తోంది. కానీ, ఇప్పుడు ఐరోపా సమాఖ్య నిబంధనలకు అనుగుణంగా యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌ను ఇచ్చింది.

* యాక్షన్‌ బటన్‌: ఇంతకుముందు ఫోన్‌కి పక్క భాగంలో వాల్యూమ్‌ రాకర్‌పైన మ్యూట్‌ లేదా వైబ్రేట్‌ బటన్‌ను ఇచ్చేవారు. ఐఫోన్‌ 15 ప్రో మోడల్స్‌‌లో దాన్ని యాక్షన్‌ బటన్‌తో రీప్లేస్‌ చేశారు. ఈ బటన్ ద్వారా కెమెరాను యాక్టివేట్‌ చేయడం, ఫ్లాష్‌లైట్‌ ఆన్‌ చేయడం, వాయిస్‌ మెమో, నోట్‌ను ప్రారంభించడం, ఫోకస్‌ మోడ్‌లను మార్చడం వంటి ఫంక్షన్లను చేయొచ్చు. అంతేకాదు.. రింగ్‌, వైబ్రేట్‌ ఆప్షన్స్‌ను మర్చుకోవడంతో పాటు ప్రత్యేకంగా కొన్ని ఫంక్షన్లను ఈ బటన్‌కి అసైన్ చేసుకోవచ్చు.


ఇకపోతే.. ఈ ఐఫోన్ 15 సిరీస్ మొబైల్ ఫోన్లు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. ఇండియాలో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. అయితే.. గత మోడల్స్‌తో పోలిస్తే మాత్రం వీటి ధర ఎక్కువగానే ఉన్నాయి. ఐఫోన్‌ 15 - రూ.79,900, ఐఫోన్‌ 15 ప్లస్ ‌- రూ.89,900, ఐఫోన్‌ 15 ప్రో - రూ.1,34,900, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్ ‌- రూ.1,59,900 ధరలుగా కేటాయించారు.

Updated Date - 2023-09-13T15:37:06+05:30 IST