PhonePe: ఫోన్‌పే యూజర్లకు పండగలాంటి వార్త.. ఇకపై ఆ విషయంలో నో టెన్షన్..!
ABN , First Publish Date - 2023-07-25T13:55:28+05:30 IST
ఫోన్‌పే కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.టెన్షన్ గా గడపాల్సిన సమయంలో పెద్ద ఊరటనిస్తోంది. దీని ఉపయోగం తెలిస్తే చాలా మంది వినియోగదారులు ఎగిరి గంతేయడం ఖాయం.
డిజిటల్ చెల్లింపుల ప్లాట్ ఫామ్ లలో ఫోన్‌పే ప్రముఖమైనది. ఒక బ్యాంక్ నుండి మరొక బ్యాంకుకు చెల్లింపులు చేయడానికి సేవలు అందించే పేమేట్(Paymate) తో ఇది భాగస్వామ్యం కలిగి ఉంది. వినియోగదారులను పెంచుకోవడానికి, మంచి సేవలు అందించే దిశగా ఫోన్‌పే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. ఇప్పుడు కూడా ఓ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. నిజంగా ఇది ఫోన్‌పే వినియోగదారులకు పండగలాంటి వార్త అని చెప్పవచ్చు.ప్రస్తుతం ఐటి రిటర్న్ దాఖలుకు గడువు ముగుస్తుండటంతో ఈ ఫీచర్ చాలా మందికి పెద్ద వరంలానే కనిపిస్తోంది. ఇంతకూ అదేంటో.. దాని ఉపయోగమేంటో వివరంగా తెలుసుకుంటే..
డిజిటల్ చెల్లింపుల(Degital payment) ప్లాట్ ఫారమ్ ఫోన్‌పే(Phonepe) తన వినియోగదారులకు కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఫోన్‌పే లోనే పన్ను చెల్లించే(Income Tax Payments in PhonePe) ప్రక్రియను ఏర్పాటుచేసింది. ఇప్పటివరకు కేవలం డబ్బు పంపడం, చెల్లింపులు, రీఛార్జీ, బిజినెస్ వంటి కార్యకలాపాలు సాగుతూ వచ్చాయి. వీటికి అనుగుణంగా ఇప్పుడు పన్ను చెల్లింపులు కూడా చేయవచ్చు. దీనికోసం చేయాల్సిందేమిటంటే..
Viral: ఏమండోయ్.. ఇది విన్నారా..? ఈ రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత.. కాసేపు కునుకు తీసేందుకు ప్రత్యేక ఏర్పాటు..!
ఆండ్రాయిడ్, ఐఓయస్(Android, IOS) మొబైల్ లో ఫోన్‌పే యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇందులో బ్యాంక్ ఖాతాను పొందుపరుచుకోవాలి.
యాప్ లో ఆర్థిక సేవలు&పన్నులు(Financial&Taxes) అనే కేటగిరీ ఎంచుకోవాలి. ఇందులో ఆదాయపు పన్ను(Income Tax) అనే ఆప్షన్ ఉంటుంది.
పన్ను చెల్లింపు కోసం పాన్ కార్డ్(Aadhaar), పన్ను వివరాలు(Tax details), ముఖ్యమైన ఇతర పేపర్స్ ను ముందే సిద్దంగా ఉంచుకోవాలి. అన్నీ అందులో సూచించిన విధంగా ఫూరించాలి.
ఆదాయపు పన్ను విభాగంలో పన్నుచెల్లింపు రకం(Tax type), పన్ను చెల్లింపు చేస్తున్న సంవత్సరం(Tax Accesment Year) ఇతర ముఖ్యమైన విషయాలు ఎంచుకోవాలి. చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని నమోదు చేయాలి. ఇలా చేసిన 2రోజుల్లో డబ్బు పన్ను విభాగానికి చెల్లించబడుతుంది.
ఈ పన్ను చెల్లింపు కూడా క్రెడిట్ కార్డ్(Credit card), డెబిట్ కార్డ్(Debit card), యుపిఐ పేమెంట్స్(UPI Payments) మార్గాలలో చెల్లించవచ్చు. అంతే కాందండోయ్.. క్రెడిట్ కార్డ్ ద్వారా జరిగే చెల్లింపులలో వడ్డీ భారం ఉండదు. బ్యాంకు ఆదారంగా చేసే చెల్లింపులపై రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి.