Redmi Note 12S: విడుదలకు చాలా సమయం ఉండగానే.. బయటకొచ్చేసిన రెడ్‌మి నోట్ 12ఎస్ స్పెసిఫికేషన్లు!
ABN , First Publish Date - 2023-03-20T15:14:30+05:30 IST
చైనీస్ మొబైల్ మేకర్ షావోమి (Xiaomi) ‘రెడ్‌మి నోట్12’ (Redmi Note 12 Series) సిరీస్‌లో
న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ షావోమి (Xiaomi) ‘రెడ్‌మి నోట్12’ (Redmi Note 12 Series) సిరీస్‌లో త్వరలోనే మరో రెండు ఫోన్లను లాంచ్ చేయబోతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే 5 జీ ఫోన్లను విడుదల చేసింది. ఇప్పుడు మరో రెండు ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో ఓ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు లీకయ్యాయి.
12 సిరీస్‌లో.. రెడ్‌మి నోట్ 12 5జీ, రెడ్‌మి నోట్ ప్రొ 5జీ, రెడ్‌మి నోట్ 12 ప్రొ ప్లస్ 5జీ ఫోన్లు ఇప్పటికే భారత్, చైనా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 23న గ్లోబల్ మార్కెట్లో ఈ సిరీస్‌లో ‘రెడ్‌మి నోట్ 12 4జి’, ‘రెడ్‌మి నోట్ 12ఎస్’లను విడుదల చేయబోతోంది. ‘రెడ్‌మి నోట్ 12 ఎస్’(Redmi Note 12S) మార్కెట్లోకి వచ్చేందుకు మరో రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉండగా తాజాగా, దీని స్పెసిఫికేషన్లు లీకయ్యాయి.
రెడ్‌మి నోట్ 12ఎస్ స్పెసిఫికేషన్లు: 6.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, మీడియాటెక్ హెలియో జి96 చిప్‌సెట్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ , ఆండ్రాయిడ్ 12 ఓఎస్, వెనవైపు 108 మెగాపిక్సల్ ప్రధాన సెన్సార్‌తో మూడు కెమెరాలు, ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉన్నాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఇది 67వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. యూఎస్‌బీ టైప్-సి చార్జింగ్ పోర్టు ఉంది.