Reliance: 50 ఏళ్ల నాటి డ్రింక్‌ను మళ్లీ తీసుకొచ్చిన రిలయన్స్
ABN , First Publish Date - 2023-03-09T22:05:13+05:30 IST
50 ఏళ్ల నాటి పానీయాల బ్రాండ్ కాంపాకోలా (Campa Cola)ను రిలయన్స్ కంపెనీ మళ్లీ ప్రారంభించింది.
ముంబై: 50 ఏళ్ల నాటి పానీయాల బ్రాండ్ కాంపాకోలా (Campa Cola)ను రిలయన్స్ కంపెనీ మళ్లీ ప్రారంభించింది. గత సంవత్సరం ఆగస్టులో ప్యూర్ డ్రింక్స్ నుంచి రూ. 22 కోట్లకు రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (Reliance Consumer Products) కొనుగోలు చేసింది. కాంపా కోలా డ్రింక్స్‌ను గురువారం రిలయన్స్ సంస్థ మార్కెట్‌లో విడుదల చేసింది. కాంపాకోలా, క్యాంపా లెమన్, కాంపా ఆరెంజ్ ఫ్లేవర్లతో ఈ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయని రిలయన్స్ పేర్కొంది.
200 ml రూ. 10, 500 ml రూ. 20, 600 ml రూ. 30, 1 లీటర్‌కు రూ. 40, 2 లీటర్‌కు రూ. 80కే అందుబాటులోకి తెచ్చామని సంస్థ తెలిపింది. కోకా-కోలా, పెప్సికో డ్రింక్స్‌తో పోలిస్తే కాంపా కోలా ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలో నేటి నుంచి విక్రయిస్తున్నట్లు రిలయన్స్ పేర్కొంది. 1980 సంవత్సరంలో భారత మార్కెట్‌లో కాంపా కోలా డ్రింక్స్ వ్యాపారం బాగా ఉండేదని, 1990లో పెప్సీకో, కోకా-కోలా భారత మార్కెట్‌లోకి వచ్చాక కాంపాకోలా కనుమరుగైంది.