Oyo Founder: రీతేష్ అగర్వాల్ పెళ్లికి సాఫ్ట్ బ్యాంక్ చీఫ్ హాజరు
ABN , First Publish Date - 2023-03-08T07:45:24+05:30 IST
ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహం అంగరంగ వైభవంగా ఢిల్లీలో జరిగింది...
న్యూఢిల్లీ: ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహం అంగరంగ వైభవంగా ఢిల్లీలో జరిగింది.(Oyo Founder Ritesh Agarwal)రితేష్ అగర్వాల్ గీతాన్షా సూద్‌ను వివాహం చేసుకున్నారు.(Wedding)రితేష్ రిసెప్షన్‌కు సాఫ్ట్‌బ్యాంక్ చీఫ్(Softbank Chief) మసోయోషి సన్(Masoyoshi Son) హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.దేశంలోని అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్‌లలో ఒకరైన రితేష్ అగర్వాల్ 2013వ సంవత్సరంలో తన 19 ఏళ్ల వయసులో ఓయోను స్థాపించారు.
ఓయోలో సాఫ్ట్‌బ్యాంక్ అతిపెద్ద పెట్టుబడిదారు. రితేష్ వివాహానికి పేటీం నుంచి విజయ్ శేఖర్ శర్మ, లెన్స్ కార్ట్ అధినేత పీయూష్ బన్సల్, పలువురు కార్పొరేట్ సంస్థల అధినేతలు పాల్గొన్నారు.కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ కూడా రితేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. రితేష్ అగర్వాల్ జంట ప్రధాని మోదీకి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కూడా ఈ జంట కలిసింది. ఓయో బడ్జెట్ హోటల్‌లతో కలిసి పర్యాటకులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తోంది.