1.27 crores: వెయ్యికాదు.. లక్షకాదు.. ఏకంగా రూ.1.27 కోట్ల నగదు..

ABN , First Publish Date - 2023-06-13T10:52:26+05:30 IST

పొల్లాచ్చికి సమీపంలోని ఆనైమలై సమీపంలో నగల వ్యాపారిపై దాడి చేసి రూ.1.27 కోట్లను దోపిడీ చేసిన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు

1.27 crores: వెయ్యికాదు.. లక్షకాదు.. ఏకంగా రూ.1.27 కోట్ల నగదు..

అడయార్‌(చెన్నై): కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి సమీపంలోని ఆనైమలై సమీపంలో నగల వ్యాపారిపై దాడి చేసి రూ.1.27 కోట్లను దోపిడీ చేసిన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరు(Coimbatore) తెలుంగు పాళెయంకు చెందిన ప్రకాష్‌ (42) కోవై పెరియకడై వీధిలో నగల వ్యాపారం చేస్తున్నారు. ఈక్రమంలో దిండిగల్‌ జిల్లాలోని రియల్‌ ఎస్టేట్‌ యజమానురాలు మీనా, తేని జిల్లాకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పాండియన్‌ పరిచయమయ్యారు. తన వద్ద రూ.2 వేల నోట్లు ఉన్నాయని, వాటిని రూ.500 నోట్లుగా బంగారం వ్యాపారుల వద్ద మార్చి ఇవ్వాలని, అలా చేస్తే 15 శాతం కమిషన్‌ ఇస్తామని ప్రకాష్‌కు మీనా ఆఫర్‌ ఇచ్చింది. ఈ మాటలు నిజమని నమ్మిన ప్రకాష్‌.. తన వద్ద ఉన్న రూ.1.27 కోట్ల రూ.500 నోట్లను తీసుకుని కారులో బయలుదేరాడు. మార్గమధ్యంలో మూడు కార్లలో వచ్చిన ఆరుగురు ప్రకాష్‌పై దాడి చేసి డబ్బు సంచులతో పారిపోయారు. దీనిపై ప్రకాష్‌ ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ దోపిడీకి పాల్పడిన మీనా, పాండియన్‌, కుట్టి, తేనికి చెందిన న్యాయవాది అళగర్‌ స్వామి, కౌశేఖర్‌, స్వామియప్పన్‌ను అరెస్టు చేశారు.

Updated Date - 2023-06-13T10:52:26+05:30 IST