Home » Chennai News
ఓ బతికున్న చేప గొంతులో ఇకుక్కోవడంతో ఓ యుకకుడు మృతిచెందిన విషాధ సంఘటన ఇది. చేపలు పట్టేందుకు వెళ్లిన ఆ యువకుడికి ఓ చేప దొరికింది. అది అటుఇటు ఎగురుతుండగా దానిని తన నోటితో పళ్ల మధ్య పెట్టుకున్నన్నాడు. అది ఒక్కసారిగా గొంతులోకి జారి ఇరుక్కుపోయి శ్వాస ఆడక మృతిచెందాడు
మహిళలను కించపరచడం డీఎంకే పార్టీ నేతలకు అలవాటేనని అన్నాడీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి సెల్లూరు రాజు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పొన్ముడి మాత్రమే కాదు, డీఎంకే నేతల్లో పలువురు మహిళలకు వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాల మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించడం అలవాటేనన్నారు.
నో డౌట్.. ఆ పార్టీకి నేనే శాశ్వత అధ్యక్షుడిని.. అంటున్నారు డాక్టర్ రాందాస్. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను స్థాపించిన పార్టీకి ఇక తానే శాశ్వత అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు.
తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష్యుడుగా నయినార్ నాగేంద్రన్ ఎన్నిక కానున్నారు. అధ్యక్ష్య పదవికి జరిగిన ఎన్నికల్లో నయినార్ నాగేంద్రన్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో అధికారిక ప్రకటన లాంఛనమే అయింది.
ప్రేమకు ఎల్లలు లేవంటే ఇదేనేమో.. తమిళ యువకుడితో వియత్నాం యువతి ప్రేమవివాహం చేసుకున్నారు. తమిళ సంస్కృతీ సంప్రదాయాలపై ఆసక్తి కలిగిన వియత్నాం యువతి తమిళ యువకుడిని ప్రేమించి తమిళ సంప్రదాయ రీతిలో వివాహం చేసుకుంది.
ప్రస్తుత వేసవిలో ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ కోతలుండవని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వేసవిలో పెరగనున్న విద్యుత్ వినియోగానికి దృష్టిలో ఉంచుకొని విద్యుత్ కొనుగోలు చేయనున్నామని తెలిపారు.
రాష్ట్రంలో మావోయిస్టు సంచారం ఉందా.. అంటే అవును.. అంటున్నాయి పోలీస్ వర్గాలు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టుల సంచారం ఉన్నట్లు పోలీస్ శాఖ పసిగట్టింది. ఈ మేరకు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తోంది.
రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. కోవై, నీలగిరి, తేని, తెన్కాశి జిల్లాల్లో రాబోయే 48 గంటల్లో భారీవర్షం కురిసే అవకాశముందని తెలిపింది.
నా రూటే సపరేటు.. అన్నట్లుగా ఓపక్క ఎండలు మండిపోతుండగా.. ఆ మంత్రి మాత్రం రెయిన్ కోట్ పంపిణీ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తమిళనాడు మంత్రి కేవీ చెళియన్ తన సొంత నిధులతో 130 మంది పాల వ్యాపారులకు రెయిన్ కోట్లు అందించారు
తాను బెయిల్ నిబంధనలు ఉల్లంఘించలేదు, అలాగే.. మంత్రి పదవిలో కూడా కొనసాగే హక్కు నాకుందని రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీ పేర్కొన్నారు. అలాగే.. ఆయన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.