Share News

BJP: 35 మంది బీజేపీ నేతలపై కేసునమోదు.. విషయం ఏంటంటే...

ABN , First Publish Date - 2023-11-10T10:10:25+05:30 IST

బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ పోలీసుల అనుమతి

BJP: 35 మంది బీజేపీ నేతలపై కేసునమోదు.. విషయం ఏంటంటే...

అడయార్‌(చెన్నై): బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ పోలీసుల అనుమతి లేకుండా ధర్నా చేసారంటూ బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధుల సహా 35 మందిపై పోలీసులు నమోదు చేశారు. బీహార్‌(Bihar) రాష్ట్రంలో చేపట్టిన కులగణన నివేదికను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మహిళలను కించపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో నితీశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఇందులోభాగంగా తమిళనాడు మహిళా మోర్చా(Tamil Nadu Mahila Morcha) ఆధ్వర్యంలో కూడా ఆందోళనకు నుంగంబాక్కం పోలీసులు అనుమతి కోరగా, వారు నిరాకరించారు. అయినప్పటికీ మహిళామోర్చా నేతలు ఆందోళన చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు.

Updated Date - 2023-11-10T10:10:27+05:30 IST