Cell phone: గోడపై కూర్చొని సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న ఆ విద్యార్థిని చివరకు ఏమైందో తెలుసా..

ABN , First Publish Date - 2023-06-10T11:31:12+05:30 IST

స్థానిక మధురవాయల్‌లో మిద్దె గోడపై కూర్చొని సెల్‌ఫోన్‌(Cell phone) మాట్లాడుతున్న విద్యార్థిని(student) కింద పడి మృతి చెందింది. వలస

Cell phone: గోడపై కూర్చొని సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న ఆ విద్యార్థిని చివరకు ఏమైందో తెలుసా..

పెరంబూర్‌(చెన్నై): స్థానిక మధురవాయల్‌లో మిద్దె గోడపై కూర్చొని సెల్‌ఫోన్‌(Cell phone) మాట్లాడుతున్న విద్యార్థిని(student) కింద పడి మృతి చెందింది. వలసరవాక్కం ఎస్వీఎస్‌ నగర్‌కు చెందిన వెంకటేశన్‌ కుమార్తె సౌమ్య(14) ప్లస్‌ టూ ముగించింది. గురువారం మధురవాయల్‌ అలంగార్‌ నగర్‌లో తన సోదరి ఇంటికి వెళ్లింది. సోదరి మిద్దెపై వాకింగ్‌ చేస్తుండగా, సౌమ్య మిద్దె గోడపై కూర్చొని సెల్‌ఫోన్‌ మాట్లాడుతోంది. ఊహించని విధంగా సౌమ్య హఠాత్తుగా మిద్దె నుంచి కింద పడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆమెను కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సలు ఫలించక మృతి చెందింది. ఈ ఘటనపై మధురవాయల్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-06-10T11:31:12+05:30 IST