ఆకలితో వచ్చిన భర్త.. వంట చేయకుండా పక్కింటి మహిళతో మాట్లాడుతున్న మహిళ.. అత్తమామలకు ఏం చెప్పాడంటే..

ABN , First Publish Date - 2023-02-13T20:54:13+05:30 IST

ఆ వ్యక్తి పనికి వెళ్లి మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్లాడు.. అప్పటికి అతని భార్య వంట చేయలేదు.. పక్కింటి మహిళతో మాట్లాడుతూ కూర్చుంది.. అప్పటికే ఆకలితో ఉన్న భర్త తీవ్ర ఆగ్రహానికి గురై ఆమెను చితక్కొట్టాడు..

ఆకలితో వచ్చిన భర్త.. వంట చేయకుండా పక్కింటి మహిళతో మాట్లాడుతున్న మహిళ.. అత్తమామలకు ఏం చెప్పాడంటే..

ఆ వ్యక్తి పనికి వెళ్లి మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్లాడు.. అప్పటికి అతని భార్య వంట చేయలేదు.. పక్కింటి మహిళతో మాట్లాడుతూ కూర్చుంది.. అప్పటికే ఆకలితో ఉన్న భర్త తీవ్ర ఆగ్రహానికి గురై ఆమెను చితక్కొట్టాడు.. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మరణించింది.. షాకైన భర్త అత్తమామల ఇంటికి వెళ్లి మూర్ఛ వ్యాధి రావడంతో భార్య చనిపోయిందని చెప్పాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు విషయం బయటపెట్టారు (Crime News).

ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) కవర్ధా జిల్లాకు చెందిన సురేష్ బైగా (28) అనే వ్యక్తి ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్లాడు. అయితే అతడి భార్య ఇంద్రావతి (24) అప్పటికి వంట చేయలేదు. పక్కింటి మహిళతో మాట్లాడుతూ కూర్చుంది. వంట చేయలేదని తీవ్ర ఆగ్రహానికి గురైన సురేష్ ఆమెను దుడ్డు కర్రతో చితక్కొట్టాడు. దెబ్బలు గట్టిగా తగలడంతో ఇంద్రావతి అక్కడికక్కడే మరణించింది. షాకైన సురేష్ వెంటనే పక్క వీధిలో ఉండే అత్తమామల ఇంటికి వెళ్లాడు. ఇంద్రావతికి మూర్ఛ వ్యాధి వచ్చిందని, వేగంగా నేలపై పడడంతో చనిపోయిందని అత్తమామలకు చెప్పాడు (Husband Killed Wife).

ప్రేమ ఎంత పని చేసింది.. ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్న యువతి పరిస్థితి ఏంటంటే..

వెంటనే ఇంద్రావతి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఫిబ్రవరి 8న ఇంద్రావతి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అయితే ఇంద్రావతి శరీరంపై దెబ్బలు ఉండడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. మహిళ శరీరంపై గాయాలు ఉన్నాయని తెలడంతో పోలీసులు సురేష్‌ని అదుపులోకి తీసుకున్నారు. అతడిని తనదైన శైలిలో ప్రశ్నించినపుడు నేరాన్ని అంగీకరించాడు.

Updated Date - 2023-02-13T20:54:14+05:30 IST