ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్‌గా జాబ్.. లక్షల్లో జీతం.. అయినా ఇదేం పాడుబుద్ధి.. భర్త నీచాలను బయటపెట్టిన భార్య..!

ABN , First Publish Date - 2023-02-27T15:24:36+05:30 IST

తను అడిగినంత కట్నం ఇవ్వడం లేదని భార్యతో అసహజ పద్ధతుల్లో శృంగారం సాగిస్తూ ఆమెకు నరకం చూపిస్తున్నాడు ఓ భర్త. భార్యను మంచానికి కట్టేసి ఆమెతో శాడిస్ట్‌లా ప్రవర్తిస్తున్నాడు.

ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్‌గా జాబ్.. లక్షల్లో జీతం.. అయినా ఇదేం పాడుబుద్ధి.. భర్త నీచాలను బయటపెట్టిన భార్య..!

తను అడిగినంత కట్నం ఇవ్వడం లేదని భార్యతో అసహజ పద్ధతుల్లో శృంగారం సాగిస్తూ ఆమెకు నరకం చూపిస్తున్నాడు ఓ భర్త. భార్యను మంచానికి కట్టేసి ఆమెతో శాడిస్ట్‌లా ప్రవర్తిస్తున్నాడు. తాము అడిగినంత కట్నం ఇచ్చే వరకు ఇలాంటి పద్ధతుల్లోనే శృంగారం చేస్తానని బెదిరించాడు. మరోవైపు అత్తమామలు, మరదలు కూడా ఆ మహిళను వేధించారు. మహిళ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు (Crime News). మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది.

బాధితురాలికి 2021 జూలైలో రూపేష్‌తో పెళ్లయింది. రూపేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్. రూ.2 లక్షలు జీతం. పెళ్లి సమయంలో బాధితురాలి తండ్రి రూపేష్‌కు రూ.10 లక్షల విలువైన కారు, నాలుగు బంగారు ఉంగరాలు, బంగారు హారం, ఖరీదైన ఎలక్ట్రిక్ వస్తువులు, కట్నంగా ఎన్నో వస్తువులు ఇచ్చాడు. అయినా అవి రూపేష్‌కు, అతడి తల్లిదండ్రులకు సరిపోలేదు. పెళ్లయిన నెల రోజులకే అత్తగారు, భర్త సోదరి అదనపు కట్నం గురించి బాధితురాలితో గొడవ పడడం మొదలుపెట్టారు (Dowry Harassment). దాంతో బాధితురాలి తండ్రి వారికి రెండు బంగారు హారాలు బహూకరించారు. కొద్దిరోజుల తర్వాత మామగారు ఇంట్లో ఫర్నీచర్‌ చేయాల్సి ఉందని, కొంత డబ్బు తీసుకురావాలని అడిగారు. అందుకు బాధిత మహిళ తిరస్కరించింది. అప్పుడు అందరూ కలిసి ఆమెను కొట్టారు.

భర్తతో గొడవ.. కొడుకు, భార్య కిడ్నాప్.. కొడుకు ఎదురుగానే కారు వెనుక సీటులో తల్లిపై సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత..

భర్త రూపేష్ మరింత వికృతంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. భార్య కాళ్లు, చేతులు మంచానికి కట్టేసి, ఆమె ప్రైవేట్ పార్టులపై కొట్టేవాడు ఆ తర్వాత అసహజ సెక్స్‌లో (unnatural acts) పాల్గొనేవాడు. ప్రతిరోజూ ఇలాగే చేసేవాడు. డబ్బు తీసుకొచ్చే వరకు అలాగే అసహజ శృంగారం చేస్తానని బెదిరించేవాడు (Sexual Harassment). ఈ విషయం ఎవరికీ చెప్పలేక ఆమె నరకం అనుభవించింది. చివరకు గతేడాది దీపావళి సమయంలో ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశారు. వారి మనసు మారుతుందని బాధిత మహిళ ఎంతగానో ఎదురుచూసింది. చివరకు పోలీసులను ఆశ్రయించింది.

Updated Date - 2023-02-27T15:24:38+05:30 IST