Gali Janardhan Reddy: గాలి జనార్దన్‌రెడ్డి ఇంట్లో పిస్తోలు చోరీ
ABN , First Publish Date - 2023-10-15T10:13:14+05:30 IST
నగరంలోని గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy) ఇంటి వద్ద భద్రతా ప్రైవేటు సెక్యూరిటీ లైసెన్సు కలిగిన 6 ఎంఎం ఫిస్తోలు చోరీకి గురయినట్లు తెలిసింది.
- పోలీసులకు ఫిర్యాదు చేసిన గన్‌మేన్
- రికవరీలో పోలీసుల తలమునకలు
బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): నగరంలోని గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy) ఇంటి వద్ద భద్రతా ప్రైవేటు సెక్యూరిటీ లైసెన్సు కలిగిన 6 ఎంఎం ఫిస్తోలు చోరీకి గురయినట్లు తెలిసింది. ఈ విషయం పై ప్రైవేటు సెక్యూరిటీ కూడా తన పిస్తోలు చోరీకి గురయినట్లు బళ్లారి ఎస్పీ(Bellary SP)కి ఫిర్యాదు చేశారని సమాచారం. ఫిస్తోలు రికవరీకి ఒక ప్రత్యేక పోలీస్ టీంను ఎస్పీ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. నగరంలోని హవ్వంబావి గాలి జనార్దన్‌రెడ్డి ఇంటి వద్ద ప్రైవేటు సెక్యూరిటీగా ఇద్దరు కాపలాదారులు ఉన్నారు. వారిలో ఒకరు లైసెన్స్‌డ్ పిస్తోల్‌ను అక్కడే ఉంచి బయటికి వెళ్లారు. దీన్ని గుర్తించిన ఎవరో వ్యక్తులు దాన్ని అపహరించారు. సెక్యూరిటీ గార్డు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటి మెయిన్ గేటు, పరిసరాలను పరిశీలించారు. సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫిస్తోలు తీసుకుపోతున్నట్లు గుర్తించారు. అయితే పిస్తోలు చోరీ నగరంలో చర్చనీయాంశంగా మారింది. అది ఎవరి చేతిలో చేరింది.. వాళ్లు ఎవరిని టార్గెట్ చేస్తారో..? అని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై పోలీసులు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.