Home » Karnataka
తల్లితో కలిసి తోటకెళ్లిన వారికి అదే చివరి రోజైన విషాద సంఘటన ఇది. వేసవి సెలవులు ఇవ్వడంతో ఇంట్లోనే ఉన్న వారు తల్లితో కలిసి తమ పొలం వద్దకు వెళ్లారు. అయితే.. అక్కడే ఉన్న వ్యవసాయ కుంటలో ప్రమాదవశాత్తూ పడిపోయి చనిపోయారు. దీంతో గ్రామంతో తీవ్ర విషాదం నెలకొంది.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) కొత్త సారధి నియామకం త్వరలోనే జరగనుందనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మార్పు అనివార్యమైతే ఆయన స్థానంలో మంత్రి ఈశ్వర్ ఖండ్రెకు అవకాశం దక్కనుందని అభిప్రాయాలు జోరందుకున్నాయి.
10 Crore Gold Loan Case: లక్కీ భాస్కర్ సినిమా స్టైల్లో ఓ బ్యాంకు మేనేజర్ కోట్ల రూపాయలు కొట్టేశాడు. ఏకంగా 10 కోట్లు దోచేశాడు. చివరకు పాపం పండి పోలీసులకు దొరికిపోయాడు. అతడితో పాటు అతడికి సాయం చేసిన ఓ మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరుకు బీజేపీ సై అంటోంది. దీనిలో భాగంగా ఇక రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమైంది. కాగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటా విఫలం చెందిందని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కేంద్రమంత్రి ప్రహ్లాద్జోషి మండిపడ్డారు
బెంగళూరులో మహిళలపై లైంగిక దాడులపై హోం మంత్రి పరమేశ్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన “మహా నగరాల్లో ఇలాంటి ఘటనలు సాధారణమే” అని చెప్పారు, దీని పై బీజేపీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది
Davangere News: దాదాపు 9 మంది ఆ ఇద్దర్నీ అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఓ చెట్టుకు కట్టేశారు. తర్వాత చిత్రహింసలు పెట్టారు. వారి చడ్డీలలోకి ఎర్ర చీమల్ని వదిలి హింసించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులకు కంప్లైంట్ అందటంతో నిందితుల కోసం అన్వేషిస్తున్నారు.
కర్ణాటకలో ఓ దంపతులకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్గా మారింది. భర్త జీవితంతో భార్య ఆడుకున్న తీరు చూసి పెళ్లంటేనే వణుకుపుట్టే పరిస్థితి ఏర్పడింది. కొడగు జిల్లా కుశాల్ నగర్ తాలూకా బసవనహళ్లి గ్రామానికి చెందిన సురేశ్కు మల్లిగే అనే యువతితో వివాహం అయ్యింది.
4 నెలల పసికందుకు కాలేయ మార్పిడి చేశారు వైద్య నిపుణులు. చెన్నైలోని వడపళని కావేరి హాస్పిటల్లో నాలుగు నెలల పసికందుకు అతి క్లిష్టమైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
కూల్.. కూల్.. వాతావరణం చల్లబడింది. గతకొద్దిరోజులుగా ఎండవేడితో అల్లాడిపోయిన ప్రజలకు గురువారం సాయంత్రం నుంచి వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రజలకు కొంత ఉపశమనం దొరికినట్లు అయింది.
కర్ణాటకలోని చిక్కమగళూరులో వ్యక్తి తన అత్త, మరదలు, కూతురును కాల్చి చంపి, చివరగా తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వదిలేసి వెళ్లిన విషయంపై ఊర్లో మాటలు పెరగడం, కూతురు పాఠశాలలో ప్రశ్నలు ఎదుర్కొవడం కారణంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు