Home » Bengaluru News
బీజేపీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు సీటీ రవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈవీఎంలపై కాంగ్రెస్ నేతలు తరచూ విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రాహుల్, ప్రియాంక అలానే గెలిచారా... అంటూ వ్యాఖ్యానించారు.
తల్లితో కలిసి తోటకెళ్లిన వారికి అదే చివరి రోజైన విషాద సంఘటన ఇది. వేసవి సెలవులు ఇవ్వడంతో ఇంట్లోనే ఉన్న వారు తల్లితో కలిసి తమ పొలం వద్దకు వెళ్లారు. అయితే.. అక్కడే ఉన్న వ్యవసాయ కుంటలో ప్రమాదవశాత్తూ పడిపోయి చనిపోయారు. దీంతో గ్రామంతో తీవ్ర విషాదం నెలకొంది.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) కొత్త సారధి నియామకం త్వరలోనే జరగనుందనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మార్పు అనివార్యమైతే ఆయన స్థానంలో మంత్రి ఈశ్వర్ ఖండ్రెకు అవకాశం దక్కనుందని అభిప్రాయాలు జోరందుకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరుకు బీజేపీ సై అంటోంది. దీనిలో భాగంగా ఇక రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమైంది. కాగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటా విఫలం చెందిందని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కేంద్రమంత్రి ప్రహ్లాద్జోషి మండిపడ్డారు
4 నెలల పసికందుకు కాలేయ మార్పిడి చేశారు వైద్య నిపుణులు. చెన్నైలోని వడపళని కావేరి హాస్పిటల్లో నాలుగు నెలల పసికందుకు అతి క్లిష్టమైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
కూల్.. కూల్.. వాతావరణం చల్లబడింది. గతకొద్దిరోజులుగా ఎండవేడితో అల్లాడిపోయిన ప్రజలకు గురువారం సాయంత్రం నుంచి వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రజలకు కొంత ఉపశమనం దొరికినట్లు అయింది.
ఉల్లాల చెరువు ఎండిపోయింది. ఎప్పుడూ లేని విధంగా ఏప్రిల్ నెల మొదటి వారంలోనే చెరువు ఈ ఎండిపోవడం గమనించదగ్గ విషయం. ప్రస్తుతం ఈ చెరువులో చుక్కనీరు కూడా లేకపోవడంతో ముఖ్యంగా వన్యప్రాణులు విలవిల్లాడిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎంతో చరిత్ర ఉన్న స్లోచ్ క్యాప్లు ఇక కనబడవు. ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి నుంచి అమల్లో ఉన్న ఈ టోపీలను రద్దు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లు ధరిస్తున్న టోపీల మార్పునకు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేపట్టింది.
రుణం తిరస్కరించడమేనన్న కారణంతో, ఓ వ్యక్తి తన ముఠాతో బ్యాంకు లాకర్లలో ఉన్న రూ.12.95 కోట్ల విలువైన బంగారాన్ని అపహరించాడు. పోలీసుల దర్యాప్తుతో ఆ బంగారం స్వాధీనం అయింది
‘కాంగ్రెస్, జేడీఎస్లో చేరే ప్రసక్తే లేదు.. గౌరవంగా పిలిస్తే బీజేపీలోకి వెళ్తా’నని బీజేపీ నుంచి ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటుకు గురైన బసనగౌడపాటిల్ యత్నాళ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంచి నేత అని అన్నారు.