Kothagudem: మిట్టమధ్యాహ్నం జరిగిన ఆ ఘటనతో అక్కడున్నవారంతా.. అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-08-16T13:11:16+05:30 IST
కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటరులోని ఓ పెట్రోల్‌బంకు(Petrol station) వద్ద మైనర్లు వీరంగం సృష్టించారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్(Onetown Police Station)కు కూత
- పెట్రోల్ బంకులో మైనర్ల వీరంగం.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు
- యువకుల పరార్, భయాందోళనలో ప్రజలు
కొత్తగూడెం: కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటరులోని ఓ పెట్రోల్‌బంకు(Petrol station) వద్ద మైనర్లు వీరంగం సృష్టించారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్(Onetown Police Station)కు కూత వేటు దూరంలో జరిగిన ఈ ఘటనతో ప్రజలు బెంబెలెత్తి పోయారు. ద్విచక్రవాహన విషయంలో వచ్చిన వివాదం చివరకు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మంగళవారం మిట్ట మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనతో ప్రజలు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని లాఠీలకు పని చెప్పారు. దీంతో అక్కడి నుంచి పరారయ్యారు. యువత గంజాయికి బానిస కావడంతో కొత్తగూడెంలో ఇటీవల ఇలాంటి దాడులు పెరిగిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. బైకు రేసులు నిర్వహిస్తూ, భారీ శబ్ధాలు చేస్తూ అతివేగంగా రహదారిపై వెళ్తు సినీ ఫక్కీలో మోబైల్‌లో బైక్ నడిపే వీడియోలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ దాడుల్లో ఉన్న కొంతమంది యువకులను వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. పెట్రోల్ బంకులో జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, అనుమానితులను వదిలే ప్రసక్తి లేదని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ చెప్పారు.