Home » Kothagudem
రాష్ట్రంలో మరో నగరపాలక సంస్థ ఏర్పాటు కానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు ఉండగా.. కొత్తగూడెం పురపాలక సంస్థను నగర పాలక సంస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భూమి కంపించింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత 5 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7.27 గంటల సమయంలో ములుగులోని మేడారం కేంద్రంగా 3-7 సెకన్ల పాటు కొనసాగిన ప్రకంపనలతో కొన్ని చోట్ల ఇళ్ల గోడలు, నేల బీటలువారాయి.
ములుగు ఏజన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు మావోయిస్టుల ఎన్కౌంటర్.. మరోవైపు సోమవారం నుంచి మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముమ్మరంగా కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిలిపివేశారు.
సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరించాలని, రూ.19,800 కోట్లకు పెంచాలని కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్(సీఈ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
మాతా, శిశు మరణాల రేటు శాతం తగ్గించడానికి భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లీడర్షిప్ ట్రైనింగ్కు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాకు చెందిన నర్సింగ్ ఆఫీసర్ సుర్నపు స్వప్న ఎంపికైంది. ప్రపంచంలోనే టెక్నాలజీలకు నిలయం, మాతా శిశు మర ణాల రేటు శాతం లేని దేశంగా పేరు ప్రఖ్యాతలు గడిచిన జపాన్ ఈ శిక్షణ కేంద్రానికి వేదిక కానుంది.
అవుట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాల చెల్లింపు కోసం లంచం తీసుకుంటూ భద్రాద్రి జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కళాశాల అడ్మినిస్ర్టేటీవ్ ఆఫీసర్(ఏవో) ఖలీలుల్లా, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్లగూడెంలోని మానస వికాస్ పాఠశాలలో ఈనెల 16న ఆరో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు సతీశ్ హోమ్ వర్క్ ఇచ్చారు. నిన్న (గురువారం) ఉదయం విద్యార్థులను ఒక్కొక్కరిగా పిలిచి తాను ఇచ్చిన వర్క్ చెక్ చేశాడు.
మావోయిస్ట్ పార్టీ మహిళా అగ్రనేత సుజాత అలియాస్ కల్పన పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వైద్యం కోసం కొత్తగూడెంలోని హాస్పిటల్కు రాగా పోలీసులు పట్టుకున్నట్లు తెలియవచ్చింది. కాగా మహబూబాబాద్ బస్టాండ్లో ఆమెను అరెస్ట్ చేసినట్లు మరో ప్రచారం జరుగుతోంది.
అంబులెన్స్ను కూడా గంజాయి రవాణాకు వాడేశారు కొందరు కేటుగాళ్లు.. అయితే, ఆ వాహనం టైరు పంక్చర్ కావడంతో రూ.కోట్ల విలువ చేసే గంజాయి గుట్టురట్టయింది.
చర్ల( Charla) మండలం చెన్నాపురం(Chennapuram) అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. పోలీసులకు కోవర్టుగా మారిందనే సమాచారంతో తోటి మహిళా మావోయిస్టును హత్య చేసి రోడ్డుపై పడేశారు.