Ranga reddy Crime: అప్పుడు జరిగితే.. ఇప్పుడు పట్టుకున్నారు.. కానీ మర్డర్ మిస్టరీ మామూలుగా లేదు
ABN , First Publish Date - 2023-09-21T20:47:31+05:30 IST
ఓ ప్రబుద్ధుడు వరుసకు కూతురయ్యే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన పెద్దలు.. అతన్ని అతి కిరాతకంగా హత్య చేసి పాతిపెట్టి పరారైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
జనం మారాలి.. వారి ఆలోచనలు మారాలి అంటూ పెద్దలు చెప్తుంటే అందరూ ఏమో అనుకున్నారు. కానీ నిజంగానే మన దేశంలో ప్రజలు మారుతున్నారు. కొందరైతే వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. దీని వల్ల కుటుంబంలోని బంధాలు నీరుగారిపోతున్నాయి. అమ్మాయి అయితే చాలు అనుకునే పరిస్థితికి దిగజారుతున్నారు. అక్కా, చెల్లెలు, చివరకు కన్న తల్లిని కూడా అనుభవించే కాలంలో మనం బతుకుతున్నామంటే.. పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఓ ప్రబుద్ధుడు వరుసకు కూతురయ్యే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన పెద్దలు.. అతన్ని అతి కిరాతకంగా హత్య చేసి పాతిపెట్టి పరారైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే.. ?
బీహార్‌కు చెందిన కరణ్ కుమార్ కోళ్ల ఫారంలో కూలీ పనులు చేస్తుంటాడు. అయితే అదే రాష్ర్టానికి చెందిన రంజిత్ కుమార్ కుటుంబంతో సహా ఉపాధి కోసం వచ్చి స్థానిక కోళ్లఫారంలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే కరణ్, రంజిత్ కుమార్ వరుసకు సోదరులు కూడా. కానీ కరణ్ వావివరుసలు లేకుండా రంజిత్ కూతురుని లైన్లో పెట్టాడు. ఆమెతో ప్రేమాయణం నడిపాడు. రంజిత్ కూతురు కరణ్‌ను అన్న అంటూ పిలిచేది. అలా పిలవకూడదని భావించి తాను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ యువతికి మాయమాటలు చెప్పి అనుభవించాడు. ఈ విషయాన్ని రంజిత్‌కు చెప్పింది కూతురు. ఆగ్రహంతో ఊగిపోయిన రంజిత్.. కరణ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అయితే కరణ్ దీనిని పక్కకు పెట్టి రంజిత్ కూతురితో ప్రేమాయణం నడిపాడు. దీంతో రంజిత్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇది మళ్లీ రిపీట్ అయితే పరిణాలు చాలా తీవ్రంగా ఉంటాయని బెదిరించడంతో కరణ్ సిద్దిపేటకు వచ్చేశాడు.
అయినా కూతురు వరస ఉన్న యువతిని వదులుకోవడం ఇష్టంలేక తనతో సాన్నిహిత్యంతో మెలిగిన ఫోటోలను రంజిత్‌కు పంపాడు. రంజిత్ తన కూతురు ఫోటోలను చూసి మనోవేదనకు గురయ్యాడు. దీంతో కరణ్‌ను చంపేదుకు ప్లాన్ వేశాడు. పొలంలో కలిసి మాట్లాడదామని ఆగస్టు 15న ఫోన్ చేసి రమ్మన్నాడు. సరే అంటూ కరణ్ అక్కడకు వెళ్లాడు. అక్కడ ఎవరూ లేకపోడంతో కరణ్‌ను రంజిత్ పట్టుకుని ఊపిరి ఆడకుండా చేశాడు. అనంతరం అక్కడే పాతిపెట్టి ఏమీ తెలియనట్లు వెళ్లిపోయాడు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అయితే కరణ్ అన్న దీపక్ గత నెల 29న కేశంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు కరణ్ హత్యకు గురైనట్లు గుర్తించారు. ఎట్టకేలకు నిందితుడు రంజిత్‌ను ప్రకాశం జిల్లా అద్దంకిలో పోలీసులు అదుపులో తీసుకుని రిమాండ్‌కు తరలించారు.