Maruti: ప్రముఖ చిత్రకారుడు మారుతి కన్నుమూత
ABN , First Publish Date - 2023-07-28T09:24:44+05:30 IST
ప్రముఖ చిత్రకారుడు మారుతి(Maruti) గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. కొంతకాలంగా హృద్రోగంతో
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రముఖ చిత్రకారుడు మారుతి(Maruti) గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. కొంతకాలంగా హృద్రోగంతో బాధపడుతున్న మారుతి పుణేలోని కుమార్తె దగ్గర ఉంటూ చికిత్స పొందుతూ అక్కడే కన్నుమూసారు. పుదుకోటలో 1938లో జన్మించిన మారుతి అసలు పేరు రంగనాధన్. తమిళ వార, దిన పత్రికల్లో మారుతి మలచిన చిత్రాలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆనందవికటన్, కుంగుమం, కన్మణి వంటి ప్రముఖ వారపత్రికల్లో నవలలు, కథానికల కోసం ఆయన చేతుల్లో ప్రాణం పోసుకున్న బొమ్మలు పాఠకుల మనస్సులను హత్తుకునేవి. ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ‘కలైమామణి’ అవార్డుతో సత్కరించింది. ఆయనకు భార్య విమల, కుమార్తెలు సుభాషిణి, సుహాసిని ఉన్నారు. తమిళ చలనచిత్రాలు ‘ఉలియిన్ ఓసై’, ‘పెన్‌సింగమ్’ వంటి పలు చిత్రాలకు ఆయన కళాదర్శకుడిగానూ పనిచేశారు.