పెళ్లికి వచ్చారు.. డాన్సులేశారు.. వధూవరులకు జీవితాంతం మర్చిపోలేని షాకిచ్చారు..!
ABN , First Publish Date - 2023-02-25T15:20:12+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఆగ్రాలో ఉన్న హోటల్ హాలీ-డే ఇన్‌లో వివాహం జరుగుతోంది.. అత్యంత వైభవంగా జరుగుతున్న ఆ వివాహ వేడుకకు ఎంతో మంది హాజరయ్యారు.. ఆ వేడుకలో ఓ ఇద్దరు వ్యక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు..
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఆగ్రాలో ఉన్న హోటల్ హాలీ-డే ఇన్‌లో వివాహం జరుగుతోంది.. అత్యంత వైభవంగా జరుగుతున్న ఆ వివాహ వేడుకకు ఎంతో మంది హాజరయ్యారు.. ఆ వేడుకలో ఓ ఇద్దరు వ్యక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.. పెళ్లి వేడుకలో అందరితో కలిసి డ్యాన్సులేశారు.. తర్వాత కొద్ది సేపటికి వారు కనిపించలేదు.. వారే కాదు.. పెళ్లి వేడుకకు హాజరైన చాలా మంది వ్యక్తుల నగలు, పర్సులు కూడా మాయమయ్యాయి.. దీంతో అందరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు (Crime News).
రామ్మోహన్ నగర్ నివాసి అర్చన శర్మ కుమారుడి వివాహం (Marriage) హోటల్ హాలీ-డే ఇన్‌లో ఫిబ్రవరి 17న జరిగింది. వధూవరులు భారీ ఊరేగింపుతో కల్యాణ వేదికకు చేరుకున్నారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఓ మహిళ వధూవరులతో ఫొటో తీయించుకునేందుకు తన బ్యాగ్‌ను టేబుల్ దగ్గర ఉంచి వేదికపైకి వెళ్లింది. 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చేసరికి ఆమె బ్యాగ్ టేబుల్‌పై లేదు. హోటల్ మొత్తం చూసినా ఎక్కడా ఆ బ్యాగ్ కనిపించలేదు. ఆమెది మాత్రమే కాదు.. మరో నలుగురి నగలు, పర్సులు కూడా మయామయ్యాయి (Robbery). దీంతో హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌ను చెక్ చేయగా అసలు విషయం బయటపడింది.
ఫ్రీగా కోడి మాంసం తినొచ్చు కదా అని అత్యాశకు పోయి.. 15 గంటల పాటు నరకం అనుభవించాడు.. అసలేం జరిగిందో తెలిస్తే..
ఆ బ్యాగ్‌ను ఓ బాలుడు, ఓ యువకుడు తీసుకెళ్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. ఇద్దరూ కొత్త బట్టలు వేసుకుని అతిథుల్లా వచ్చారు. ఊరేగింపులోనూ, పెళ్లి వేదిక వద్ద ఇద్దరూ డ్యాన్స్ చేస్తూ పాడుతూ కనిపించారు. వాళ్ళిద్దరూ అమ్మాయి తరఫు వారని, వరుడి తండ్రి అనుకున్నారు. పోయిన బ్యాగ్‌లో బ్యాగ్‌లో లక్ష రూపాయలు, బంగారు నగలు ఉన్నాయని బాధితురాలు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.