Share News

MMTS train: అయ్యోపాపం ఎంతఘోరం.. ఎంఎంటీఎస్‌ రైలులో డోర్‌ దగ్గర నిలబడి..

ABN , First Publish Date - 2023-12-10T07:55:33+05:30 IST

స్నేహితులతో కలిసి దైవదర్శనం చేసుకునేందుకు ఎంఎంటీఎస్‌ రైలు(MMTS train)లో డోర్‌ దగ్గర నిలబడి ప్రయాణం

MMTS train: అయ్యోపాపం ఎంతఘోరం.. ఎంఎంటీఎస్‌ రైలులో డోర్‌ దగ్గర నిలబడి..

- ఎంఎంటీఎస్‌ రైలు డోర్‌ వద్ద ప్రయాణం చేస్తుండగా..

సికింద్రాబాద్‌, (ఆంధ్రజ్యోతి): స్నేహితులతో కలిసి దైవదర్శనం చేసుకునేందుకు ఎంఎంటీఎస్‌ రైలు(MMTS train)లో డోర్‌ దగ్గర నిలబడి ప్రయాణం చేస్తున్న ఓ విద్యార్థి విద్యుత్‌ స్తంభం తగిలి మృతిచెందాడు. ఈ సంఘటన శనివారం సంజీవయ్య పార్కు సమీపంలో జరిగింది. సికింద్రాబాద్‌ రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం గోల్నాకకు చెందిన శివకుమార్‌ కుమారుడు బంటి 8వ తరగతి విద్యార్థి. శనివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి బల్కంపేట్‌ ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకునేందుకు విద్యానగర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఎంఎంటీఎస్‌ రైలు ఎక్కాడు. సంజీవయ్య పార్కు - జెమ్స్‌ స్ట్రీట్‌ రైల్వే స్టేషన్‌ల మార్గమధ్యలో కదులుతున్న రైలు డోర్‌ వద్ద ఉన్న బంటి విద్యుత్‌ స్తంభానికి తగిలి కింద పడిపోయాడు. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-12-10T07:55:34+05:30 IST