ఏడుస్తూ కుప్పకూలిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. అంత్యక్రియల తర్వాత అనుమానంతో అతడి ఫోన్‌ను ఆ తండ్రి చెక్ చేస్తే..

ABN , First Publish Date - 2023-03-07T15:45:37+05:30 IST

ప్రేమ పేరుతో ఓ యువతి ఓ యువకుడి జీవితంతో ఆటలాడుకుంది. మరో యువకుడితో కలిసి అమాయకుడిని మోసం చేసింది. ప్రేయసి టార్చర్ తట్టుకోలేక ఆ యువకుడు ప్రాణం తీసుకున్నాడు.

ఏడుస్తూ కుప్పకూలిన కొడుకు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. అంత్యక్రియల తర్వాత అనుమానంతో అతడి ఫోన్‌ను ఆ తండ్రి చెక్ చేస్తే..

ప్రేమ (Love) పేరుతో ఓ యువతి ఓ యువకుడి జీవితంతో ఆటలాడుకుంది. మరో యువకుడితో కలిసి అమాయకుడిని మోసం చేసింది. ప్రేయసి టార్చర్ తట్టుకోలేక ఆ యువకుడు ప్రాణం తీసుకున్నాడు. కొడుకు ఎందుకు చనిపోయాడో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చివరకు అతడి మొబైల్ ద్వారా అసలు విషయం తెలుసుకున్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు (Viral Video).

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఝాన్సీ జిల్లాకి చెందిన సంజు అహిర్వార్ అనే యువకుడు ఫిబ్రవరి 17న అనుమానాస్పద స్థితిలో మరణించాడు. టెర్రస్‌పై నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు సంజును ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ 2 రోజుల తర్వాత సంజు మృతి చెందాడు. సంజు తండ్రి కొడుకు ఫోన్ (Mobile Recording) తీసి చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. జూలీ అనే అమ్మాయి సంజును బెదిరిస్తోంది. తను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, అత్యాచారం కేసు పెడతానని హెచ్చరిస్తోంది (Black Mail).

Funny Video: వధువును ఎత్తుకుని మెట్లు దిగుతూ అకస్మాత్తుగా కిందపడిపోయాడు.. మరుక్షణమే వరుడు చేసిన పనేంటో మీరే చూడండి..!

జూలీతో పాటు అంకిత్ అనే కుర్రాడు కూడా సంజుకు ఫోన్ చేసి వేధిస్తున్నాడు. జూలీతో సంజు సన్నిహితంగా ఉన్న ఫొటోలను (Obscene Photos) చూపించి బెదిరిస్తున్నాడు. రెండు, మూడు సార్లు కొట్టినట్టు కూడా బయటపడింది. వారిద్దరితో మాట్లాడిన కాల్స్‌ను సంజు రికార్డు చేశాడు. వారిద్దరి వేధింపులను తట్టుకోలేక సంజు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జూలీ, అంకిత్ తన కుమారుడిని వేధిస్తున్న రికార్డింగ్‌లను పోలీసులకు వినిపించిన సంజూ తండ్రి వారిపై కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరినీ ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2023-03-07T15:45:37+05:30 IST