Notification: ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
ABN , First Publish Date - 2023-06-30T12:34:58+05:30 IST
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)-‘నేషనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్‌సీఈటీ) 2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా నాలుగేళ్ల ‘ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్(ఐటీఈపీ)’లో ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)-‘నేషనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్‌సీఈటీ) 2023’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా నాలుగేళ్ల ‘ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్(ఐటీఈపీ)’లో ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఆర్‌ఐఈలు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు/యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ ఇస్తారు. వీటి వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చు. దేశంలోని 178 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మొత్తం 13 మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లోని హెచ్‌ఈఐలు-ప్రోగ్రామ్‌లు-సీట్లు
తెలంగాణ: హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీకాం బీఈడీ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో బీఎస్సీ బీఈడీ ప్రోగ్రామ్ ఉంది. మంచిర్యాలలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బీఏ బీఈడీ ప్రోగ్రామ్ ఉంది.
ఆంధ్రప్రదేశ్: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఏ బీఈడీ ప్రోగ్రామ్ ఉంది. శ్రీకాకుళంలోని డా.బీ.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీలో బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి.
ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ భువనేశ్వర్, నిట్ త్రిపుర, నిట్ కాలికట్, నిట్ పుదుచ్చెరీల్లో బీఎస్సీ బీఈడీ ప్రోగ్రామ్ ఉంది.
సీట్లు: ప్రతి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్(హెచ్‌ఈఐ)లో ప్రతి ప్రోగ్రామ్‌లో 50 సీట్లు ఉన్నాయి.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీకాం బీఈడీ ప్రోగ్రామ్‌లలో ఒక్కోదానిలో 100 సీట్లు ఉన్నాయి.
అర్హత: ప్రోగ్రామ్‌లకు నిర్దేశించిన అర్హత వివరాల కోసం సంబంధిత సంస్థల వెబ్‌సైట్లను చూడవచ్చు.
ఎన్‌సీఈటీ వివరాలు: ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో మొత్తం 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఈ పరీక్షలో నాలుగు సెక్షన్లు ఉం టాయి. మొదటి సెక్షన్‌లో అభ్యర్థి ఎంచుకున్న రెండు లాంగ్వేజ్‌ల నుంచి ఒక్కోదానిలో 20 ప్రశ్నలు ఇస్తారు. రెండో సెక్షన్‌లో అభ్యర్థి ఎంచుకున్న కోర్సుకు సంబంధించిన మూడు సబ్జెక్టుల్లో ఒక్కోదానిలో 25 ప్రశ్నలు ఇస్తారు. ఇవి ఇంటర్ స్థాయిలో ఉంటాయి. మూడో సెక్షన్‌లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ అంశాల నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. నాలుగో సెక్షన్‌లో టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు.
ఈ పరీక్షని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహిస్తారు.
లాంగ్వేజ్‌లు: తెలుగు, ఇంగ్లీష్, హిందీ, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ, అరబిక్, బోడో, చైనీస్, డోగ్రీ, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కశ్మీరీ, కొంకణి, మైథిలి, మణిపురి, నేపాలీ, పర్షియన్, రష్యన్, సంథాలీ, సింధీ, స్పానిష్, టిబెటన్, సంస్కృతం
సబ్జెక్టులు: అకౌంటెన్సీ/బుక్ కీపింగ్, అగ్రికల్చర్, ఆంత్రపాలజీ, బయాలజీ/బయలాజికల్ స్టడీ్‌స/బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ, బిజినెస్ స్టడీస్, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్, ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఆంత్రప్రెన్యూర్‌షిప్, ఫైన్ ఆర్ట్స్/విజువల్ ఆర్ట్స్(స్కల్ప్‌చర్/పెయింటింగ్)/కమర్షియల్ ఆర్ట్.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 18
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: జూలై 19
కరెక్షన్ విండో ఓపెన్: జూలై 20 నుంచి 23 వరకు
అభ్యర్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాల ప్రకటన: జూలై 25 నుంచి
అడ్మిట్ కార్డ్‌ల డౌన్‌లోడింగ్: పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు
వెబ్‌సైట్: www.nta.ac.in