IIM Ranchiలో పీహెచ్‌డీ ప్రవేశానికి దరఖాస్తులు
ABN , First Publish Date - 2023-02-17T18:24:02+05:30 IST
రాంచీ (Ranchi) లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (Indian Institute of Management) (ఐఐఎం రాంచీ) - పీహెచ్‌డీ (Phd) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. రెగ్యులర్, ఎగ్జిక్యూటివ్ కేటగిరీలలో ఈ ప్రోగ్రామ్
రాంచీ (Ranchi) లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (Indian Institute of Management) (ఐఐఎం రాంచీ) - పీహెచ్‌డీ (Phd) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. రెగ్యులర్, ఎగ్జిక్యూటివ్ కేటగిరీలలో ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. రెగ్యులర్ ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. అకడమిక్ ప్రతిభ, జాతీయ పరీక్ష స్కోర్, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు సెమినార్ (Seminar), పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులకు ప్రవేశాలు కల్పిస్తారు.
స్పెషలైజేషన్‌లు: అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఎకనామిక్స్, జనరల్ మేనేజ్‌మెంట్ - బిజినెస్ లా - బిజినెస్ ఎథిక్స్ - రెగ్యులేటరీ ఎన్విరాన్‌మెంట్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్.
్ఞఅర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఏదేని మాస్టర్స్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులు; బీకాం డిగ్రీతోపాటు కనీసం 55 శాతం మార్కులతో సీఏ/ఐసీడబ్ల్యూఏఐ/ సీఎస్ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమవుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు జూన్ 30 నాటికి సంబంధిత సర్టిఫికెట్‌లు, మార్కుల పత్రాలు అందచేయాల్సి ఉంటుంది. నెట్-జేఆర్‌ఎ్‌ఫ(యూజీసీ/సీఎ్‌సఐఆర్) అర్హత లేదా క్యాట్/ గేట్/ జీమ్యాట్/ జీఆర్‌ఈ వ్యాలిడ్ స్కోర్ ఉండాలి. ఐఐఎంల నుంచి 6.5 సీజీపీఏతో పీజీడీఎం/పీజీడీహెచ్‌ఆర్‌ఎం/పీజీడీఏబీఎం ఉత్తీర్ణులకు ఈ స్కోర్ అవసరం లేదు. అభ్యర్థుల వయసు జూన్ 30 నాటికి 55 ఏళ్లు మించకూడదు. రెగ్యులర్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అనుభవం తప్పనిసరి కాదు. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌నకు మార్చి 31 నాటికి కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.
ఫైనాన్షియల్ సపోర్ట్: రెగ్యులర్ ప్రోగ్రామ్‌లో చేరినవారికి మాత్రమే ఆర్థిక సహకారం అందిస్తారు. దీని కింద ట్యూషన్ ఫీజుతోపాటు భోజన, వసతి ఖర్చులు చెల్లిస్తారు. మొదటి రెండేళ్లు నెలకు రూ.30,000; తరవాతి రెండేళ్లు నెలకు రూ.35,000ల స్టయిపెండ్ ఇస్తారు. కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ కొనుగోలు కోసం రూ.50,000; కంటింజెన్సీ అలవెన్స్ కింద రూ.1,00,000లు ఇస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 20
వెబ్‌సైట్: iimranchi.ac.in