Education: జయశంకర్‌ వర్సిటీలో బీటెక్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2023-10-11T16:38:42+05:30 IST

హైదరాబాద్‌-రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (పీజేటీఎ్‌సఏయూ)-ఎంపీసీ స్ట్రీమ్‌ కింద బీటెక్‌(ఫుడ్‌ టెక్నాలజీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఫైనల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోంది.

Education: జయశంకర్‌ వర్సిటీలో బీటెక్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌-రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (పీజేటీఎ్‌సఏయూ)-ఎంపీసీ స్ట్రీమ్‌ కింద బీటెక్‌(ఫుడ్‌ టెక్నాలజీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఫైనల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోంది. నిజామాబాద్‌ జిల్లా-రుద్రూర్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ ఫుడ్‌ సైన్స్‌ & టెక్నాలజీలో 47 రెగ్యులర్‌ సీట్లు; 10 సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ కోటా సీట్లు ఉన్నాయి. వ్యవసాయ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు 40 శాతం సీట్లు ప్రత్యేకించారు. టీఎస్‌ ఎంసెట్‌ 2023 ర్యాంక్‌ ఆధారంగా అభ్యర్థులకు సీట్లు అలాట్‌ చేస్తారు. ఇంకా సీట్లు మిగిలిన పక్షంలో ఇంటర్‌/పన్నెండోతరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మేథమెటిక్స్‌, ఫిజికల్‌ సైన్సెస్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌/పన్నెండోతరగతి ఉత్తీర్ణులై టీఎస్‌ ఎంసెట్‌ 2023 అర్హత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 2023 డిసెంబరు 31 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 22 ఏళ్లు; దివ్యాంగులకు 27 ఏళ్లు మించకూడదు.

ప్రాసెసింగ్‌ ఫీజు: రెగ్యులర్‌ అభ్యర్థులకు రూ.1000; సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ కోటా అభ్యర్థులకు రూ.5,000

కౌన్సెలింగ్‌ తేదీ: అక్టోబరు 16న ఉదయం పది గంటలకు

వేదిక: ఎగ్జామినేషన్‌ సెంటర్‌, రాజేంద్రనగర్‌, పీజేటీఎ్‌సఏయూ

  • కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సిన సర్టిఫికెట్‌లు: పదోతరగతి, ఇంటర్‌/పన్నెండోతరగతి సర్టిఫికెట్‌లు, మార్కుల పత్రాలు; తెలంగాణ ఎంసెట్‌ 2023 హాల్‌ టికెట్‌, ర్యాంక్‌ కార్డ్‌; ఆరు నుంచి పన్నెండో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్‌లు/బోనఫైడ్‌; టీసీ; కులం, ఆదాయం, స్థానికత ధృవీకరణ పత్రాలు; నాన్‌ మున్సిపల్‌ ఏరియా స్టడీ సర్టిఫికెట్‌, అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ హోల్డింగ్‌ సర్టిఫికెట్‌.

వెబ్‌సైట్‌: pjtsau.edu.in

Updated Date - 2023-10-11T16:38:42+05:30 IST