Summer courses: విదేశాల్లో చదివే వేసవి కోర్సులు ఇవే..!

ABN , First Publish Date - 2023-06-01T13:40:45+05:30 IST

వేసవి వచ్చిందంటే చాలు, పిల్లలను ఎలా ఎంగేజ్‌ చేయాలన్న ప్రశ్న తల్లిదండ్రులకు తలెత్తుతుంది. వినోదానికి తోడు విజ్ఞానం ఈ పోటీయుగంలో చాలా

Summer courses: విదేశాల్లో చదివే వేసవి కోర్సులు ఇవే..!
Summer courses

వేసవి వచ్చిందంటే చాలు, పిల్లలను ఎలా ఎంగేజ్‌ చేయాలన్న ప్రశ్న తల్లిదండ్రులకు తలెత్తుతుంది. వినోదానికి తోడు విజ్ఞానం ఈ పోటీయుగంలో చాలా అవసరమని కూడా వారు భావిస్తుండటం న్యూట్రెండ్‌. తొమ్మిది ఆ పై తరగతులు చదువుతున్న విద్యార్థులు దేశంలోనే కాదు, విదేశాల్లోనూ కొన్ని సమ్మర్‌ కోర్సులు చేసే అవకాశం ఉంది. అవి ఏమిటో ఇక్కడ ఒక లుక్‌ వేయండి....

  • కాలేజీలో చదువుతున్న విద్యార్థి ఈ వేసవిలో విదేశాల్లోని యూనివర్సిటీలో ఏదైనా కోర్సు చేయగలిగితే పలు విధాలుగా మేలు జరుగుతుంది. ఆ కోర్సులతో సాధించిన క్రెడిట్లను తాము ప్రస్తుతం చదువుతున్న వర్సిటీకి బదలాయించుకోవచ్చు. చదువుతున్న కాలేజీల్లో లేని కోర్సు చేసి సర్టిఫికెట్‌ పొందవచ్చు. ఇవన్నీ రెజ్యూమెను మరింత బలంగా మారుస్తాయి. వ్యక్తిగతంగా నాలెడ్జ్‌ని పెంచుకోవచ్చు. చాలా వర్సిటీలు సాధారణంగా రెండు నుంచి నాలుగు వారాల వ్యవధి కలిగిన సమ్మర్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తుంటాయి. ఇవి కొన్ని క్రెడిట్స్‌ కలిగి ఉండటానికి తోడు సబ్జెక్టు స్పెసిఫిక్‌గా ఉంటాయి. ఒక యూనివర్సిటీలో చేరేందుకు ఆ క్రెడిట్లు పనికిరావచ్చు. లేదంటే లైఫ్‌ స్టయిల్‌ మార్చుకునేందుకు ఉపయోగడవచ్చు. సాఫ్ట్‌ స్కిల్స్‌,. విదేశీ వర్సిటీలకు అప్లయ్‌ చేసే విధానం, ఎస్‌ఓపీ(స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌) రాయగలగడం ద్వారా రెజ్యూమేను స్ట్రాంగ్‌గా చేసుకోవడం వరకు అన్నీ ఉంటాయి. పబ్లిక్‌ స్పీకింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, డిబేటింగ్‌, రోబోటిక్స్‌, స్పోర్ట్స్‌, డిజైన్‌ తదితరాలపై క్లాస్‌లకు హాజరుకావచ్చు. వీటిపై టేస్టర్‌ సెషన్స్‌ కూడా ఉంటాయి. తద్వారా ఆ యూనివర్సిటీ లేదా ఆ కోర్సుతో ఏమి తెలుసుకోవచ్చు, మరేమి లభిస్తుంది అన్న విషయాలపై అవగాహన ఏర్పడుతుంది.

  • విదేశాల్లో చేసే ఈ సమ్మర్‌ కోర్సులు విద్యార్థులకు చాలా విధాలుగా ఉపయోగపడతాయి. కేరక్టర్‌ బిల్డింగ్‌తో మొదలుకుని విశ్వాసాన్ని ప్రోది చేసుకోవడం, మనోధైర్యం పెంపు, సొంతంగా నేర్చుకోగలగడం, బాధ్యత, కొత్త సంస్కృతులపై అవగాహన పెంచుకోవడం వరకు ఎన్నో ప్రయోజనాలు ఈ కోర్సులతో లభిస్తాయి. వీటికయ్యే ఖర్చులు భరించుకోగలిగే స్థాయిలోనే ఉంటాయి. అక్కడ ఉండటానికి తోడు తరగతులు, చివర్లో సర్టిఫికెట్‌ వరకు అంతటికీ ఒకే మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. షార్ట్‌ టూర్‌ వీసా ఈ కోర్సులకు అప్లయ్‌ చేసేందుకు సరిపోతుంది.

  • ఈ కోర్సులు చాలా వరకు హైస్కూల్‌ విద్యార్థులకు ఉద్దేశించి ఉంటాయి. క్షేత్ర సందర్శనకు ట్రిప్స్‌ సహా మిళితమై ఉంటాయి. అటు నాలెడ్జ్‌ ఇటు ఫన్‌కు అవకాశం కల్పించేలా వీటిని తీర్చిదిద్దుతారు.

  • బిజినెస్‌ అండ్‌ ఎకనామిక్స్‌, ఇంజనీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, మెడికల్‌ సైన్స్‌, ఆర్టిఫీఫియల్‌ ఇంటెలిజెన్స్‌, మీడియా స్టడీస్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, సస్టయినబుల్‌ డెవల్‌పమెంట్‌, లా తదితరాల్లో అందించే సమ్మర్‌ కోర్సులు పాపులర్‌. టీమ్‌ వర్క్‌, కమ్యూనికేషన్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌, క్రిటికల్‌ థింకింగ్‌ స్కిల్స్‌ను నేర్చుకునేందుకుఈ కోర్సులన్నీ ఉపయోగపడతాయి.

పాపులర్‌ సమ్మర్‌ స్కూల్స్‌

ఆక్స్‌ఫర్డ్‌ రాయల్‌ అకాడమీ: ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ కలిసి 42కి మించి సమ్మర్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. 13 - 24 సంవత్సరాల వయస్కులు చేరొచ్చు హైస్కూల్‌ విద్యార్థుల నుంచి యంగ్‌ గ్రాడ్యుయేట్లకు వీటిని ఉద్దేశించారు.

లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌: రమారమి వంద ప్రోగ్రామ్‌లను ఆఫర్‌ చేస్తోంది. ఎకనామిక్స్‌, బిజినెస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, అకౌంటింగ్‌, ఫైనాన్స్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, గవర్నమెంట్‌, సైకాలజీ అండ్‌ సొసైటీ, లా, రీసెర్చ్‌ మెథడ్స్‌, డేటా సైన్స్‌, మేథమెటిక్స్‌లో ప్రోగ్రామ్స్‌ ఉన్నాయి. వీటిని పూర్తి చేసిన విద్యార్థులకు మూడు నుంచి నాలుగు క్రెడిట్స్‌ వరకు వారు చేసే వర్సిటీలో బ్యాచిలర్స్‌, మాస్టర్స్‌ కోర్సుకు బదిలీ అవుతాయి. హై జీపీఏకు తోడు ఐఈల్‌టీఎ్‌సలో మంచి స్కోర్‌ ఉన్న విద్యార్థులు ఈ సమ్మర్‌ ప్రోగ్రామ్‌ల్లో చేరొచ్చు.

కింగ్స్‌ కాలేజీ లండన్‌: హైస్కూల్‌, కాలేజీ విద్యార్థుల కోసం మీడియా స్టడీస్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, లా, సైకాలజీ, మెడికల్‌ సైన్సెస్‌, ఇంజనీరింగ్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌లో కోర్సులు ఉన్నాయి

జర్మనీలో

టీయూ బెర్లిన్‌ సమ్మర్‌ అండ్‌ వింటర్‌ స్కూల్‌: జూలై, ఆగస్ట్‌, జనవరి నెలల్లో రెండు నుంచి నాలుగు వారాల కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ అలాగ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్‌ చదువుతున్న విద్యార్థులకు ఇవి ఉపయోగపడతాయి. ఈ కోర్సులతో టీయూ బెర్లిన్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది. ఆరు వరకు యురోపియన్‌ క్రెడిట్‌ పాయింట్స్‌ వస్తాయి. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, స్పేస్‌ సైన్స్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షి్‌పలో కోర్సులు ఎక్కువ ఉన్నాయి.

యూనివర్సిటీ ఆఫ్‌ బెర్లిన్‌: రెండు నుంచి అయిదు వారాల కోర్సులు - మేకింగ్‌ ఆఫ్‌ యూరప్‌, హిస్టరీ ఆఫ్‌ ఆర్ట్‌ తదితరాల్లో ఉన్నాయి. 5 నుంచి 13 పాయింట్లు - యురోపియన్‌ క్రెడిట్స్‌ కింద లభిస్తాయి.

అమెరికా: స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, హార్వర్డ్‌ స్కూల్‌, కొలంబియా సమ్మర్‌ స్కూల్‌, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కార్నెల్‌, బ్రౌన్‌ యూనివర్సిటీ ఎక్కువగా హైస్కూల్‌ విద్యార్థులకు సమ్మర్‌ కోర్సులను నిర్వహిస్తాయి. పార్సన్స్‌ దగ్గర ఉన్న ద న్యూ స్కూల్‌ - యానిమేషన్‌తో కలిపి ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌, ఇంటీరియర్‌ డిజైన్‌, మీడియ అండ్‌ ఫిల్మ్‌ స్టడీస్‌, ఫొటోగ్రఫి, పోర్ట్‌ఫోలియో మేకింగ్‌ తదితర కోర్సులను హైస్కూల్‌, కాలేజీ విద్యార్థులకు అందిస్తోంది.

ఇతర దేశాల్లో

న్యూజీలాండ్‌: యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్‌లాండ్‌ ఆరు వారాల ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. వీటి నుంచి పొందే క్రెడిట్స్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌కు మార్చుకోవచ్చు. మాక్లిన్స్‌ కాలేజీ, ఆక్‌లాండ్‌ - హైస్కూల్‌ విద్యార్థులకు స్పోర్ట్స్‌, హాస్పిటాలిటీ అండ్‌ టూరిజం, కాలేజ్‌ ప్రిపరేషన్‌, గ్లోబల్‌ సిటిజెన్‌షి్‌పలో సమ్మర్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది.

నెదర్లాండ్స్‌: బ్యాచిలర్‌, మాస్టర్స్‌ కోర్సు చేసేవారికి ఇక్కడి యూట్రెచ్ట్‌ యూనివర్సిటీ ముఖ్యంగా డేటా సైన్స్‌ నుంచి సస్టయినబిలిటీ క్రైసిస్‌ వరకు వివిధ కోర్సులను అందిస్తోంది.

స్పెయిన్‌: ఐఈ యూనివర్సిటీ మార్డిడ్‌, ఈయూ బిజినెస్‌ స్కూల్‌ బార్సిలోనా ఒకటి నుంచి రెండు వారాల కోర్సులను ప్రీ యూనివర్సిటీ, యూజీ నుంచి ఇటీవలి గ్రాడ్యుయేట్లకు ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. దాదాపుగా టాప్‌ వర్సిటీలన్నీ సమ్మర్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయని చెప్పవచ్చు.

Updated Date - 2023-06-01T13:40:45+05:30 IST