Share News

Education: తెలంగాణ వ్యవసాయ వర్సిటీల్లో డిగ్రీ థర్డ్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2023-10-17T12:21:51+05:30 IST

ల్‌ యూనివర్సిటీ(ఎ్‌సకేఎల్‌టీఎ్‌సహెచ్‌యూ) ఉమ్మడిగా వ్యవసాయ ఆధారిత డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి థర్డ్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి.

Education: తెలంగాణ వ్యవసాయ వర్సిటీల్లో డిగ్రీ థర్డ్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ(పీజేటీఎ్‌సఏయూ), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ(పీవీఎన్‌ఆర్‌టీవీయూ), సిద్దిపేట్‌-ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ(ఎ్‌సకేఎల్‌టీఎ్‌సహెచ్‌యూ) ఉమ్మడిగా వ్యవసాయ ఆధారిత డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి థర్డ్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి. దీని ద్వారా బైపీసీ స్ట్రీం కింద బీఎస్సీ ఆనర్స్‌ అగ్రికల్చర్‌, బీవీఎస్సీ & ఏహెచ్‌, బీఎ్‌ఫఎస్సీ, బీఎస్సీ ఆనర్స్‌ హార్టికల్చర్‌ ప్రోగ్రామ్‌లలో మిగిలిన సీట్లు భర్తీ చేయనున్నారు. సీట్ల వివరాలను అక్టోబరు 18 నాటికి ప్రకటిస్తారు. తెలంగాణ ఎంసెట్‌ 2023 ర్యాంక్‌ ఆధారంగా రాష్ట్రంలోని అగ్రికల్చర్‌, వెటర్నరీ, హార్టికల్చర్‌ కళాశాలల్లో సీట్లు అలాట్‌ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన అగ్రికల్చరల్‌ కాలేజ్‌-తోర్నాల(సిద్దిపేట్‌), కాలేజ్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌-మల్యాల్‌(మహబూబాబాద్‌)లో సెకండ్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ తరవాత మిగిలిన సీట్లను కూడా ఈ నోటిఫికేషన్‌ ద్వారానే భర్తీ చేస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

అర్హత

  • బైపీసీ స్ట్రీం కింద మొదటి ఫేజ్‌ కౌన్సెలింగ్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు సబ్మిట్‌ చేసి ఉండాలి.

  • మొదటి రెండు కౌన్సెలింగ్‌లలో పాల్గొనని అభ్యర్థులు, మొదటి రెండు ఫేజ్‌లలో సీటు రానివారు, సీటు వచ్చినా కాలేజీ మారాలనుకునేవారు/కాలేజీలో రిపోర్ట్‌ చేయనివారు/అడ్మిషన్‌ క్యాన్సిల్‌ చేసుకున్నవారు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌: తెలంగాణ ఎంసెట్‌ 2023లో 352 - 25976 మధ్య ర్యాంక్‌ వచ్చిన అన్ని కేటగిరీల అభ్యర్థులు అక్టోబరు 20న కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. 26016 - 39977 మధ్య ర్యాంక్‌ వచ్చిన అన్ని కేటగిరీల అభ్యర్థులు; 40020 - 49766 మధ్య ర్యాంక్‌ వచ్చిన ఓసీ, బీసీ-బీ, బీసీ-డీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన రూరల్‌/ఫార్మర్స్‌ కోటా అభ్యర్థులు; 40020 - 80118 మధ్య ర్యాంక్‌ వచ్చిన బీసీ-ఏ, బీసీ-సీ, బీసీ-ఈ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందిన రూరల్‌/ఫార్మర్స్‌ కోటా అభ్యర్థులు అక్టోబరు 21న కౌన్సెలింగ్‌కు రావాలి.

వేదిక: యూనివర్సిటీ ఆడిటోరియం, పీజేటీఎ్‌సఏయూ క్యాంపస్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌

వెబ్‌సైట్‌: www.pjtsau.edu.in

Updated Date - 2023-10-17T12:21:51+05:30 IST