Gurukula Teachers Special: జనరల్ స్టడీస్ ఇలా ప్రిపేర్ అయితే..!
ABN , First Publish Date - 2023-05-29T12:47:07+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంసిద్ధం అయ్యే ప్రతి అభ్యర్థి జనరల్ స్టడీస్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. సాధారణంగా పోటీ పరీక్షల కోసం బరిలో ఉన్న అభ్యర్థులు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంసిద్ధం అయ్యే ప్రతి అభ్యర్థి జనరల్ స్టడీస్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. సాధారణంగా పోటీ పరీక్షల కోసం బరిలో ఉన్న అభ్యర్థులు తమ సబ్జెక్ట్స్‌కు ఇచ్చినంత ప్రాధాన్యం జనరల్ స్టడీస్‌కు ఇవ్వరు. జనరల్ స్టడీస్‌లో అనేక అంశాలు ఉంటాయి. వాటిలోని సంక్లిష్ఠత దృష్ట్యా అభ్యర్థుల్లో ఆందోళన, భయం పెరుగుతుంది. ఫలితంగా వారు జనరల్ స్టడీస్ అంశాలపై ఎక్కువగా దృష్టి సారించరు. వాస్తవానికి జనరల్ స్టడీ్‌సపై పట్టు సాధించకుండా, ప్రభుత్వ ఉద్యోగం పొందడం సాధ్యం కాదు. ఈ వాస్తవ నేపథ్యంలో అభ్యర్థులు జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవాలి.
గురుకుల్ బోర్డు నిర్దేశించిన సిలబ్‌సలో జనరల్ స్టడీస్ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం మూడు పేపర్లలో మొదటిది జనరల్ స్టడీస్. ఈ పేపర్ సిలబస్, ప్రిపరేషన్ విధానం, రెఫరెన్స్ పుస్తకాలపై అవగాహన కలుగజేయడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం.
జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్
వాస్తవానికి మన చుట్టూ ఉన్న సమాజం పట్ల, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో అవగాహన పెంచుకోవడం, శాస్త్ర, సాంకేతిక శాస్త్రాలతోపాటు, సామాజిక శాస్త్రాల్లో వస్తున్న నూతన మార్పులను గమనించడం, కరెంట్ అఫైర్స్‌పై మంచి పట్టు సాధించడం జనరల్ స్టడీస్ ప్రిపరేషన్‌కు అవసరం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్‌కు, తెలంగాణ గురుకుల్ బోర్డు సిలబ్‌సకు మధ్య అనేక సమరూప అంశాలు ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబ్‌సలో జనరల్ స్టడీస్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వగా... గురుకుల్ బోర్డ్ సిలబ్‌సలో జనరల్ స్టడీ్‌సతోపాటు జనరల్ ఎబిలిటీస్, లాంగ్వేజ్ ఎబిలిటీ్‌సకు ప్రాధాన్యం పెంచారు.
సెక్షన్-1, జనరల్ స్టడీస్ సిలబస్
కరెంట్ అఫైర్స్- ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన, ప్రభుత్వ విధానాలు
సామాజిక వెలివేత, హక్కుల ప్రాధాన్యం, లింగ, జాతి, కుల, తెగ, వైకల్య వర్గాల సమ్మిళిత విధానాలు
తెలంగాణ సమాజం, సంస్కృతి, నాగరికత, వారసత్వం, కళలు, సాహిత్యం, నిర్మాణాలు - భారతదేశ సంస్కృతి, వారసత్వం
శాస్త్ర విజ్ఞానం- భారతదేశ విజయాలు
పర్యావరణ అంశాలు- విపత్తు నిర్వహణ - సుస్థిరాభివృద్ధి
భారతదేశ, తెలంగాణ సాంఘిక, ఆర్థిక అంశాలు
సామాజిక, ఆర్థిక, రాజకీయ తెలంగాణ చరిత్ర - తెలంగాణ రాష్ట్ర ఉద్యమం - తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
సెక్షన్-2, సాధారణ సామర్థ్యాలు లేదా జనరల్ ఎబిలిటీస్
విశ్లేషణ సామర్థ్యాలు - లాజికల్ రీజనింగ్, డేటా ఇంట్రప్రిటేషన్
నైతిక విలువలు, వృత్తిపరమైన విద్యా అంశాల నైతికత
టీచింగ్ ఆప్టిట్యూడ్
సెక్షన్-3, ఇంగ్లీష్ భాష నైపుణ్యాలు
పాఠశాల స్థాయి గ్రామర్
పదజాలం
వాక్య నిర్మాణాలు
గురుకుల్ జనరల్ స్టడీస్ సిలబ్‌సలో ప్రశ్నలు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అడుగుతారు. మొదటి పేపర్‌లో మూడు విభాగాలు ఉన్నప్పటికీ మార్కుల విభజనను స్పష్టంగా ప్రకటించలేదు. గత ప్రశ్న పత్రాలను ప్రాతిపదికగా తీసుకుంటే...
జనరల్ స్టడీస్‌కు 50 మార్కులు
జనరల్ ఎబిలిటీ్‌సకు 25 మార్కులు
భాషా నైపుణ్యాలకు 25 మార్కులుగా గుర్తించాలి
జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ ఎలా?
గురుకుల్ బోర్డు పరీక్షలు, నిర్వహణ, ఉద్యోగాలు అన్నీ తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగం. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తెలంగాణ అంశాలపై పట్టు సాధించాలి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, నిర్మాణాలు, వారసత్వం, ఉద్యమ కారణాలు, రాష్ట్ర ఆవిర్భావం ప్రధాన ప్రిపరేషన్‌గా ఉండాలి.
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో కొవిడ్ అనంతరం పర్యావరణ, విపత్తు నిర్వహణ అంశాలకు ప్రాధాన్యం పెరిగింది. ఇటీవలి కాలంలో నిర్వహించిన పరీక్షల ప్రశ్నల సరళికి అనుగుణంగా అభ్యర్థులు తమ ప్రిపరేషన్ విధానాన్ని రూపొందించుకోవాలి. భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ అంశాలపై అవగాహన కోసం ఇంటర్ స్థాయి, ప్రధానంగా రెండో సంవత్సర పాఠ్యపుస్తకం సివిక్స్ లేదా రాజనీతిశాస్త్రం ఉపయోగపడుతుంది. ఇంటర్ సెకండియర్ ఎకనామిక్స్ ఆర్థిక అంశాలపై ప్రాథమిక సమాచారం ఇస్తుంది. కరెంట్ అఫైర్స్ కోసం ప్రతిరోజు దినపత్రికలు చదవాలి.
జనరల్ ఎబిలిటీస్ ప్రిపరేషన్ ఎలా?
జనరల్ ఎబిలిటీస్ విభాగంలో మూడు అంశాలు ఉంటాయి. రీజనింగ్, డేటా ఇంట్రప్రిటేషన్ కోసం పాత ప్రశ్న పత్రాలను నిశితంగా పరిశీలించాలి. ప్రధానంగా ఇటీవలి కాలంలో నిర్వహించిన పరీక్షల ప్రశ్నల సరళిని గమనించాలి.
టీచింగ్ ఆప్టిట్యూడ్ కోసం నెట్/సెట్/జేఆర్‌ఎఫ్ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. క్లాస్ రూం ఓరియంటేషన్‌లో ఈ అంశాలను జోడించి చూడగలగాలి.
సెక్షన్-3, ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం
ఈ విభాగంలో సెకండరీ స్థాయి గ్రామర్‌పై పట్టు ఉండాలి. ఆర్టికల్స్, టెన్సెస్, నౌన్స్, ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్స్, వొకాబులరీ వంటి వాటితో పాటు పద, వాక్య నిర్మాణాలపై ప్రిపరేషన్ అవసరం.
ఇలా చదవాలి
గురుకుల్ బోర్డు నిర్వహిస్తున్న పరీక్షల్లో అన్ని ఉద్యోగాలకు జనరల్ స్టడీస్ సిలబస్ ఒకటే. అభ్యర్థులు ప్రధానంగా అర్హతలకు అనుగుణంగా ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రణాళికను రూపొందించుకోవాలి. అందుకోసం సిలబ్‌సను కింది విధంగా వర్గీకరించుకోవాలి.
కరెంట్ అఫైర్స్
సామాజిక శాస్త్రాలు - ప్రధానంగా తెలంగాణ అంశాలు
ఎథిక్స్ - టీచింగ్ అప్టిట్యూడ్
రీజనింగ్
ఇంగ్లీష్ భాష
పై అంశాలపై అవగాహన కోసం పాత పరీక్ష పత్రాలు, ప్రధానంగా గతంలో గురుకుల్ బోర్డు నిర్వహించిన వాటిని సేకరించి, ప్రశ్నల సరళిని పరిశీలించాలి.
సిలబస్‌ను వివరంగా అర్థం చేసుకోవడం కోసం ప్రామాణిక పుస్తకాలు మాత్రమే చదవాలి. పుస్తకాలు కొనే ముందు రచయిత అర్హతలు చెక్ చేసుకోవాలి.
ఈ మధ్య కాలంలో టెస్ట్ సిరీస్‌ల పేరున కోకోల్లలుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష పేపర్లు తయారు చేసే వారి అర్హతలు, అనుభవాలు తెలుసుకోవాలి.
ఒక అకడమిక్ పాకెట్ డైరీ రాయడం ప్రారంభించాలి. ఏయే సబ్జెక్టులకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో క్రమ పద్ధతి ప్రకారం నోట్ చేసుకోవాలి.
మీలాగే ప్రిపేర్ అవుతున్న విద్యార్థులతో ఒక చిన్న గ్రూప్‌గా ఏర్పడి నిరంతరం ప్రిపరేషన్ వాతావరణంలో ఉండాలి.
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో కొవిడ్ అనంతరం పర్యావరణ, విపత్తు నిర్వహణ అంశాలకు ప్రాధాన్యం పెరిగింది. ఇటీవలి కాలంలో నిర్వహించిన పరీక్షల ప్రశ్నల సరళికి అనుగుణంగా అభ్యర్థులు తమ ప్రిపరేషన్ విధానాన్ని రూపొందించుకోవాలి.
-డాక్టర్ రియాజ్
సీనియర్ ఫ్యాకల్టీ, అకడమిక్ డైరెక్టర్,
5 మంత్ర కెరీర్ పాయింట్, హైదరాబాద్