జామ్ 2024 నోటిఫికేషన్ విడుదల
ABN , First Publish Date - 2023-08-11T17:04:03+05:30 IST
బయోటెక్నాలజీ, సైన్సెస్ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకొనేవారి కోసం ఉద్దేశించిన ‘జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్) 2024’ నోటిఫికేషన్ వెలువడింది. దీనిని ఈ ఏడాది ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో సాధించిన స్కోర్ ద్వారా
బయోటెక్నాలజీ, సైన్సెస్ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకొనేవారి కోసం ఉద్దేశించిన ‘జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్) 2024’ నోటిఫికేషన్ వెలువడింది. దీనిని ఈ ఏడాది ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో సాధించిన స్కోర్ ద్వారా ఎమ్మెస్సీ; ఎమ్మెస్సీ(టెక్); ఎంఎ్స(రీసెర్చ్); జాయింట్/డ్యూయల్ డిగ్రీ ఎమ్మెస్సీ- పీహెచ్డీ; ఎమ్మెస్సీ-ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ; ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 21 ఐఐటీలు అందిస్తున్న వివిధ పీజీ ప్రోగ్రామ్‌లలో సుమారు 3000 సీట్లను జామ్ స్కోర్ ద్వారా నేరుగా భర్తీ చేస్తారు. అలాగే నిట్లు, ఐసర్లు, ఐఐఎస్సీ, ఐఐఈఎ్సటీ, డీఐఏటీ, ఐఐపీఈ, జేఎన్‌సీఏఎ్‌సఆర్, ఎస్‌ఎల్‌ఐఈటీ సహా ప్రముఖ సీఎ్్ఫటీఐ సంస్థల్లోని 2000కు పైగా సీట్ల భర్తీకి కూడా ఈ స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటారు.
జామ్ పేపర్లు: జామ్ ఎగ్జామ్‌ను ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్లో కెమిస్ట్రీ, జియాలజీ, మేథమెటిక్స్ పేపర్లు; మధ్యాహ్నం సెషన్లో బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, మేథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు గరిష్ఠంగా రెండు పేపర్లు రాయవచ్చు. రెండు పేపర్లు రాసేవారు ఉదయం సెషన్ నుంచి ఒక పేపర్, మధ్యాహ్నం సెషన్ నుంచి మరో పేపర్ ఉండేలా చూసుకోవాలి.
అర్హత: అభ్యర్థి జామ్‌లో ఎంచుకొన్న పేపర్/పేపర్లను అనుసరించి సంబంధిత సబ్జెక్టులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు; సంబంధిత ఇండియన్ డిగ్రీ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి నిబంధనలు లేవు.
జామ్ 2024 వివరాలు: ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అన్నీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలే ఇస్తారు. మొత్తం 60 ప్రశ్నలకుగాను 100 మార్కులు కేటాయించారు. పేపర్లో మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్లో 30 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. వీటిలో పది ప్రశ్నలకు ఒక్కోదానికి ఒక మార్కు మిగిలిన 20 ప్రశ్నలకు ఒక్కోదానికి రెండు మార్కులు నిర్దేశించారు. రెండో సెక్షన్లో 10 మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకూ ఒకటి లేదా అంత కంటే ఎక్కువ సమాధానాలు ఉంటాయి. వాటన్నింటినీ గుర్తించాలి. ప్రశ్నకు రెండు మార్కులు ప్రత్యేకించారు. మూడో సెక్షన్లో 20 న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో పది ప్రశ్నలకు ఒక్కోదానికి ఒక మార్కు మిగిలిన పది ప్రశ్నలకు ఒక్కోదానికి రెండు మార్కులు ప్రత్యేకించారు. వీటికి ఆప్షన్స్ ఇవ్వరు. ఒక నెంబర్‌ను సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. మొదటి సెక్షన్లో మాత్రమే నెగెటివ్ మార్కులు వర్తిస్తాయి. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే కేటాయించిన మార్కుల్లో మూడోవంతు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు ఒక పేపర్ మాత్రమే రాయాలంటే రూ.1800; రెండు పేపర్లు రాయాలంటే రూ.2500 చెల్లించాలి. మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఒక పేపర్ రాయాలంటే రూ.900; రెండు పేపర్లు రాయాలంటే రూ.1250 చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 5 నుంచి
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 13
అడ్మిట్ కార్డ్‌ల డౌన్లోడింగ్: 2024 జనవరి 8 నుంచి
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
జామ్ 2024 ఎగ్జామ్ తేదీ: 2024 ఫిబ్రవరి 11
ఫలితాలు విడుదల: 2024 మార్చి 22
స్కోర్ కార్డ్ డౌన్లోడింగ్: 2024 ఏప్రిల్ 2 నుంచి జూలై 31 వరకు
వెబ్సైట్: https://jam.iitm.ac.in