Admissions: కాళోజీ వర్సిటీ అనుబంధ కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా అడ్మిషన్స్‌

ABN , First Publish Date - 2023-08-08T12:15:06+05:30 IST

వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సె్‌స(కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌)- మెడికల్‌, డెంటల్‌ డిగ్రీ కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌/ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వర్సిటీకి అనుబంధంగా ఉన్న ప్రైవేట్‌ అన్‌

Admissions: కాళోజీ వర్సిటీ అనుబంధ కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా అడ్మిషన్స్‌

వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సె్‌స(కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌)- మెడికల్‌, డెంటల్‌ డిగ్రీ కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌/ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వర్సిటీకి అనుబంధంగా ఉన్న ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ నాన్‌ మైనారిటీ/మైనారిటీ మెడికల్‌ ్క్ష డెంటల్‌ కళాశాలల్లో బీ కేటగిరీ, సీ కేటగిరీ(ఎన్‌ఆర్‌ఐ) సీట్లు భర్తీ చేయనున్నారు. ఆర్మీ డెంటల్‌ కాలేజ్‌ సహా అనురాగ్‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న నీలిమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సీట్లను కూడా ఈ నోటిఫికేషన్‌ ద్వారానే అలాట్‌ చేస్తారు. కౌన్సెలింగ్‌ నాటికి సీట్ల వివరాలు ప్రకటిస్తారు.

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ(బోటనీ, జువాలజీ)/బయోటెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు. నీట్‌ యూజీ 2023 అర్హత పొంది ఉండాలి. ఇందులో జనరల్‌ అభ్యర్థులకు 137; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 107; జనరల్‌ దివ్యాంగులకు 121 స్కోర్‌ను కటా్‌ఫగా నిర్దేశించారు. విద్యార్థుల వయసు 2023 డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. ఎన్‌ఆర్‌ఐల రక్త సంబంఽధీకులు మాత్రమే ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు అప్లయ్‌ చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.6300

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 12

దరఖాస్తుతోపాటు అప్‌లోడ్‌ చేయాల్సిన పత్రాలు: అభ్యర్థి ఫొటో; నీట్‌ యూజీ 2023 అడ్మిట్‌ కార్డ్‌, స్కోర్‌ కార్డ్‌; ఆధార్‌ కార్డ్‌, ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు; ఇంటర్‌/ తత్సమాన కోర్సు స్టడీ సర్టిఫికెట్‌; కులం, ఆదాయం, వైకల్యం సంబంధిత ధ్రువీకరణ పత్రాలు; ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్‌షిప్‌ సర్టిఫికెట్‌; ఎన్‌ఆర్‌ఐ బ్యాంక్‌ అకౌంట్‌ పాస్‌బుక్‌; ఎన్‌ఆర్‌ఐ పాస్‌పోర్ట్‌ కాపీ; పదోతరగతి, ఇంటర్‌ సర్టిఫికెట్‌లు, మార్కుల పత్రాలు.

వెబ్‌సైట్‌: knruhs.telangana.gov.in

Updated Date - 2023-08-08T12:15:06+05:30 IST