Hyderabad: జేఎన్‌టీయూహెచ్‌లో ఎంబీఏ కోర్సు.. ఎవరికి అవకాశం అంటే..!
ABN , First Publish Date - 2023-09-01T12:38:38+05:30 IST
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్‌టీయూహెచ్)-‘మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)’ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇది మూడేళ్ల వ్యవధి గల సెకండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) డిగ్రీ ప్రోగ్రామ్.
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్‌టీయూహెచ్)-‘మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)’ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇది మూడేళ్ల వ్యవధి గల సెకండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) డిగ్రీ ప్రోగ్రామ్. ఆరు సెమిస్టర్లు ఉంటాయి. యూజీసీ నిబంధనల ప్రకారం ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఎంటెక్/ఎంఫార్మసీ/ఎమ్మెస్సీ/ఎంసీఏ మొదటి సంవత్సర కోర్సులు చదువుతున్నవారు ఈ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. అభ్యర్థులు ప్రస్తుతం చదువుతున్న కాలేజీలో ఆఫ్‌లైన్ తరగతులు, జెన్‌టీయూహెచ్ నుంచి ఆన్‌లైన్ సెషన్స్ ఉంటాయి. అటానమస్, నాన్ అటానమస్, జేఎన్‌టీయూహెచ్ అనుబంధ కళాశాలలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రతి కాలేజ్‌లో సెక్షన్‌కు 30 మంది ఉండేలా పలు సెక్షన్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు తమ కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలి.
ప్రోగ్రామ్ వివరాలు
ఊ ఇందులో డేటా అనలిటిక్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ అనాలిసిస్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, బిజినెస్ ఎకనామిక్స్, లీగల్ అండ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ తదితర అంశాలు బోధిస్తారు.
ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ అంశాలకు సంబంధించిన ఫంక్షనల్ నాలెడ్జ్; బిజినెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీలపై శిక్షణ ఇస్తారు. అభ్యర్థులు మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌గా ఎదిగేందుకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు. మేనేజ్‌మెంట్ విధి విధానాలు, కాన్సె్‌ప్టలు, ప్రిన్సిపల్స్ తదితరాలపై అవగాహన కల్పిస్తారు.
కళాశాలలు తమ ఆమోదాన్ని తెలిపేందుకు చివరి తేదీ: సెప్టెంబరు 30
సెమిస్టర్ ఫీజు: రూ.25,000
అభ్యర్థులు సెమిస్టర్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: అక్టోబరు 30
వెబ్‌సైట్: www.jntuh.ac.in