IIPSలో పీజీ, పీహెచ్‌‌డీ ప్రవేశాలు

ABN , First Publish Date - 2023-02-22T13:33:13+05:30 IST

ముంబై (Mumbai)లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్)-వివిధ ప్రోగ్రామ్‌లలో

IIPSలో పీజీ, పీహెచ్‌‌డీ ప్రవేశాలు
ప్రవేశాలు

ముంబై (Mumbai)లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్)-వివిధ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంఏ/ ఎమ్మెస్సీ, ఎంబీడీ, ఎంపీఎస్‌, పీహెచ్‌డీ, పీడీఎఫ్‌ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో పీజీ ప్రోగ్రామ్‌లో 55 సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రవేశం పొందిన అభ్యర్థులకు నెలకు రూ.5,000 ప్రభుత్వ ఫెలోషిప్‌గా లభిస్తుంది.

ఎంఏ/ ఎమ్మెస్సీ ఇన్‌ పాపులేషన్‌ స్టడీస్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. కనీసం 55 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు జూన్‌ 30 నాటికి 25 ఏళ్లు మించకూడదు.

మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ బయో స్టాటిస్టిక్స్‌ అండ్‌ డెమోగ్రఫీ: ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. బయో స్టాటిస్టిక్స్‌/హెల్త్‌ స్టాటిస్టిక్స్‌/ మేథమెటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌ ప్రధాన సబ్జెక్టుగా బీఏ/బీఎస్సీ ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు. కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి. అభ్యర్థుల వయసు జూన్‌ 30 నాటికి 25 ఏళ్లు మించకూడదు.

మాస్టర్‌ ఆఫ్‌ పాపులేషన్‌ స్టడీస్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఆంత్రోపాలజీ/బయో స్టాటిస్టిక్స్‌/ డెవల్‌పమెంట్‌ స్టడీ్‌స/ ఎకనామిక్స్‌/ జాగ్రఫీ/ హెల్త్‌ స్టాటిస్టిక్స్‌/ మేథమెటిక్స్‌/ పాపులేషన్‌ స్టడీస్‌/ పొలిటికల్‌ సైన్స్‌/ పాపులేషన్‌ ఎడ్యుకేషన్‌/ సైకాలజీ/రూరల్‌ డెవల్‌పమెంట్‌/ సోషల్‌ వర్క్‌/ సోషియాలజీ/ స్టాటిస్టిక్స్‌ ప్రధాన సబ్జెక్టుగా ఎంఏ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సబ్జెక్టులు మినహా ఇతర సబ్జెక్టులతో ఏదేని పీజీ పూర్తిచేసి పాపులేషన్‌ అండ్‌ హెల్త్‌ రిలేటెడ్‌ ఫీల్డ్‌లో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. జూన్‌ 30 నాటికి అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ ఇన్‌ పాపులేషన్‌ స్టడీస్‌/ బయోస్టాటిస్టిక్స్‌ అండ్‌ డెమోగ్రఫీ: ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. గరిష్ఠంగా ఆరేళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఎంపీఎస్‌ లేదా ఎంఏ/ ఎమ్మెస్సీ ఇన్‌ పాపులేషన్‌ స్టడీస్‌ ఉత్తీర్ణులు; ఎమ్మెస్సీ ఇన్‌ బయో స్టాటిస్టిక్స్‌ అండ్‌ డెమోగ్రఫీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంఫిల్‌ (పాపులేషన్‌ స్టడీ్‌స/డెమోగ్రఫీ/బయో స్టాటిస్టిక్స్‌ అండ్‌ డెమోగ్రఫీ) ఉత్తీర్ణులు కూడా అర్హులే. కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి. అభ్యర్థి వయసు జూన్‌ 30 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఆన్‌లైన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌, రిసెర్చ్‌ ప్రపోజల్‌, ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. యూజీసీ నెట్‌ ఆర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఫెలోషిప్‌ కింద మొదటి రెండేళ్లు నెలకు రూ.12000; తరవాత రెండేళ్లు నెలకు రూ.14000 చెల్లిస్తారు. కంటింజెన్సీ గ్రాంట్‌ కింద ఏడాదికి రూ.10,000 ఇస్తారు.

పార్ట్‌ టైం పీహెచ్‌డీ: ఈ ప్రోగ్రామ్‌లో రెండు సీట్లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగు నుంచి ఆరేళ్లు. వయోపరిమితి నిబంధనలు లేవు. పీజీ(పాపులేషన్‌ స్టడీస్‌/డెమోగ్రఫీ/ పబ్లిక్‌ హెల్త్‌) ఉత్తీర్ణతతోపాటు కనీసం అయిదేళ్ల అనుభవం ఉన్నవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులను ఆఫ్‌లైన్‌ రిటెన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వీరికి ఫెలోషిప్‌ ఇవ్వరు.

ఆన్‌లైన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌: ఈ పరీక్షని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. కోర్సును అనుసరించి బేసిక్‌ జనరల్‌ నాలెడ్జ్‌, లాజికల్‌ రీజనింగ్‌, ఇంగ్లీష్‌ గ్రామర్‌, బేసిక్‌ మేథమెటిక్స్‌, పాపులేషన్‌, హెల్త్‌, సోషల్‌ సైన్సెస్‌, హెల్త్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌/ మేథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, బయో స్టాటిస్టిక్స్‌, రిసెర్చ్‌ మెథడాలజీ, పాపులేషన్‌ స్టడీస్‌, డెమోగ్రఫీ, ఎపిడిమియాలజీ నుంచి మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు.

పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌: ఈ ప్రోగ్రామ్‌లో అయిదు సీట్లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. పీహెచ్‌డీ(పాపులేషన్‌ స్టడీస్‌/ హెల్త్‌ స్టడీస్‌/ జెండర్‌ స్టడీస్‌/ డెవల్‌పమెంట్‌ స్టడీస్‌/ సోషల్‌ సైన్సెస్‌) పూర్తిచేసినవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు జూన్‌ 30 నాటికి 40 ఏళ్లు మించకూడదు. ప్రజంటేషన్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ ప్రపోజల్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫెలోషిప్‌ కింద నెలకు రూ.50,000ల నగదుతోపాటు హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు. ఈ ప్రోగ్రామ్‌నకు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1,000; ఓబీసీ అభ్యర్థులకు రూ.500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 2

పీడీఎఫ్‌ ప్రోగ్రామ్‌నకు ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 30

ఆన్‌లైన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ విడుదల: ఏప్రిల్‌ 13న

అడ్మిట్‌ కార్డ్‌ల డౌన్‌లోడింగ్‌: ఏప్రిల్‌ 21 నుంచి

ఆన్‌లైన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీ: ఏప్రిల్‌ 30

ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: మే 8

ఆఫ్‌లైన్‌ రిటెన్‌ టెస్ట్‌ తేదీ: జూన్‌ 9

పర్సనల్‌ ఇంటర్వ్యూలు: జూన్‌ 16 నుంచి

ప్రోగ్రామ్‌లు ప్రారంభం: జూలై 11 నుంచి

చిరునామా: అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, అకడమిక్‌ సెక్షన్‌, ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌, గోవండి స్టేషన్‌ రోడ్‌, డియోనార్‌, ముంబై-400088

వెబ్‌సైట్‌: www.iipsindia.ac.in

Updated Date - 2023-02-22T13:33:14+05:30 IST