Share News

Education: ఐఆర్‌ఎంఏలో పీజీ డిప్లొమా ప్రవేశాలు

ABN , First Publish Date - 2023-10-13T17:16:44+05:30 IST

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్‌ (ఐఆర్‌ఎంఏ) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (రూరల్‌ మేనేజ్‌మెంట్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

Education: ఐఆర్‌ఎంఏలో పీజీ డిప్లొమా ప్రవేశాలు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్‌ (ఐఆర్‌ఎంఏ) - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (రూరల్‌ మేనేజ్‌మెంట్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది రెండేళ్ల వ్యవధిగల ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌ మేనేజీరియల్‌ ప్రోగ్రామ్‌. దీనికి ఏఐయూ, ఏఐసీటీఈ, ఎన్‌బీఏ సంస్థల గుర్తింపు ఉంది. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 240 సీట్లు ఉన్నాయి. వీటిలో అయిదు శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థులకు కేటాయించారు. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు లేవు. ఫైనాన్షియల్‌ అసిస్టెన్స్‌ కింద మెరిట్‌ స్కాలర్‌షి్‌పలు ఇస్తారు.

ప్రోగ్రామ్‌ వివరాలు

  • ప్రోగ్రామ్‌లో భాగంగా ఇండక్షన్‌ ఫీల్డ్‌ వర్క్‌ సెగ్మెంట్‌, నారన్‌పూర్‌ ఎక్స్‌ప్రె్‌స(సిమ్యులేషన్‌ గేమ్‌ ఫీల్డ్‌ వర్క్‌), క్లాస్‌రూమ్‌ సెగ్మెంట్స్‌, విలేజ్‌ ఫీల్డ్‌వర్క్‌ సెగ్మెంట్‌, సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ఉంటాయి.

  • మైక్రో ఎకనామిక్స్‌, మాక్రో ఎకనామిక్స్‌, పర్‌స్పెక్టివ్స్‌, అండర్‌స్టాండింగ్‌ ఆర్గనైజేషన్స్‌, ప్రొడక్షన్‌ అండ్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ అంశాలకు సంబంధించి మేజర్‌ కోర్సులు; ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్‌ ఓరియంటెడ్‌ కోర్సులు ఉంటాయి.

  • ప్రోగ్రామ్‌ చివరి ఏడాది ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌ అకౌంటింగ్‌ కాస్టింగ్‌, ఐటీ అండ్‌ సిస్టమ్స్‌, మార్కెటింగ్‌, ఓబీ-హెచ్‌ఆర్‌, ప్రొడక్షన్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యూటీ, సోషల్‌ సైన్సెస్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌ల నుంచి ఎలక్టివ్‌ కోర్సులు ఎంచుకోవాల్సి ఉంటుంది.

అర్హత: ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు కూడా అర్హులే. వీరు ప్రోగ్రామ్‌ ప్రారంభం నాటికి డిగ్రీ సర్టిఫికెట్‌లు సబ్మిట్‌ చేయాలి. క్యాట్‌ 2023/ఎక్స్‌ఏటీ 2024/సీమ్యాట్‌ 2023 స్కోర్‌ తప్పనిసరి. ఈ మూడు స్కోర్‌లు ఉన్న వారికి మూడింటిలో బెటర్‌ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొంటారు. ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థులకు 2019 జనవరి తరవాత నిర్వహించిన జీమ్యాట్‌ స్కోర్‌ను అనుమతిస్తారు. వయోపరిమితి నిబంధనలు లేవు. 2023 సెప్టెంబరు 30 నాటికి కనీసం మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

ఎంపిక: జాతీయ పరీక్ష స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు రిటెన్‌ ఎబిలిటీ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి నిర్దేశిత వెయిటేజీ ప్రకారం అడ్మిషన్స్‌ ఇస్తారు.

వెయిటేజీ: జాతీయ పరీక్ష స్కోర్‌కు 35 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూ స్కోర్‌కు 35 శాతం, రిటెన్‌ ఎబిలి టెస్ట్‌కు 5 శాతం, అకడమిక్‌ ప్రతిభకు 5 శాతం, అనుభవానికి 5 శాతం వెయిటేజీ ఇస్తారు.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.2,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000; ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థులకు రూ.3,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 26

వెబ్‌సైట్‌: www.irma.ac.in

Updated Date - 2023-10-13T17:16:44+05:30 IST