ESI: హైదరాబాద్ సనత్‌నగర్ ఈఎస్‌ఐలో పోస్టులు.. ఖాళీలు ఎన్నంటే..!
ABN , First Publish Date - 2023-06-02T12:50:33+05:30 IST
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి
హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు 76
పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషలిస్ట్‌లు
విభాగాలు: ఐసీయూ, జనరల్ మెడిసిన్, హెమటాలజీ, ఈఎన్‌టీ, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, అంకాలజీ, డార్మటాలజీ, ఫిజికల్ మెడిసిన్, టీబీ/చెస్ట్, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, అనాటమీ, రేడియాలజీ తదితరాలు.
అర్హత: 1. ఫ్యాకల్టీ/సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
2. సూపర్ స్పెషలిస్ట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.
వయసు: 45-67 ఏళ్లు ఉండాలి
జీతభత్యాలు: పోస్టును అనుసరించి నెలకు రూ.67,700- రూ. 2 లక్షలు చెల్లిస్తారు
దరఖాస్తు ఫీజు: రూ.500
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది
ఇంటర్వ్యూ వేదిక: అకడమిక్ బ్లాక్, ఈఎ్‌సఐసీ మెడికల్ కాలేజ్,
సనత్‌నగర్.
ఇంటర్వ్యూ తేదీలు:
పోస్టులను అనుసరించి 2023 జూన్ 06 - 10
వెబ్‌సైట్: https://www.esic.gov.in/recruitments