Tirupati ఐఐటీలో సైన్స్‌ హ్యాక్‌.. వీరికి మాత్రమే ప్రత్యేకం!

ABN , First Publish Date - 2023-02-21T17:21:25+05:30 IST

తిరుపతి (Tirupati) లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (Indian Institute of Technology) (ఐఐటీటీపీ) - నేషనల్‌ సర్వీస్‌ స్కీం (National Service Scheme) (ఎన్‌ఎస్‌ఎస్‌) కింద ‘సైన్స్‌ హ్యాక్‌ - 3.0’ పేరుతో ఆన్‌లైన్‌

Tirupati ఐఐటీలో సైన్స్‌ హ్యాక్‌.. వీరికి మాత్రమే ప్రత్యేకం!
వీరికి మాత్రమే ప్రత్యేకం!

తిరుపతి (Tirupati) లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (Indian Institute of Technology) (ఐఐటీటీపీ) - నేషనల్‌ సర్వీస్‌ స్కీం (National Service Scheme) (ఎన్‌ఎస్‌ఎస్‌) కింద ‘సైన్స్‌ హ్యాక్‌ - 3.0’ పేరుతో ఆన్‌లైన్‌ ప్రాజెక్ట్‌ కాంపిటేషన్‌ను నిర్వహిస్తోంది. దీనిని పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకించారు. ఆరోతరగతి నుంచి పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ‘గ్రూప్‌ 1’; తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ‘గ్రూప్‌ 2’ కేటగిరీల్లో పోటీ నిర్వహిస్తారు.

పోటీ వివరాలు: విద్యార్థులు ప్రయోగ అంశాన్ని స్వయంగా ఎంచుకోవాలి. ప్రయోగం చేస్తూ మొత్తం ప్రక్రియను వీడియో రికార్డ్‌ చేయాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఒకదానిలో ప్రయోగాన్ని వివరించాలి. వీడియో నిడివి పది నుంచి పదిహేను నిమిషాలకు మించకూడదు.

  • ఈ వీడియోని సంస్థ వెబ్‌సైట్‌లో ఇచ్చిన లింక్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలి. లింక్‌లో ఇచ్చిన దరఖాస్తు ఫారంలో విద్యార్థి వివరాలు నమోదు చేసి సబ్మిట్‌ చేయాలి.

  • విజేతల వివరాలను సంస్థ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. విద్యార్థులకు ఈ మెయిల్‌ ద్వారా కూడా తెలియజేస్తారు. గెలుపొందినవారికి బహుమతులతోపాటు ఈ-సర్టిఫికెట్‌ ఇస్తారు. అంతేగాక ఐఐటీ తిరుపతి నిర్వహించే ఓపెన్‌ స్కూల్‌ డే 2023 ప్రోగ్రామ్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.

ముఖ్య సమాచారం

ప్రాజెక్ట్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేసేందుకు చివరి తేదీ: మార్చి 15

వెబ్‌సైట్‌: www.iittp.ac.in

Updated Date - 2023-02-21T17:21:26+05:30 IST