TSPSC Group 4 Exam Halltickets: గ్రూప్‌-4 పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల.. ఎప్పటివరకు అంటే..!

ABN , First Publish Date - 2023-06-24T14:02:10+05:30 IST

తెలంగాణలో జరగబోయే గ్రూప్-4 పరీక్ష హాల్ టికెట్లను టీఎస్‌పీఎస్సీ (TSPSC Group 4 Exam Halltickets) విడుదల చేసింది. జులై 1న గ్రూప్-4 ఎగ్జాయ్ జరగనుంది. ఇందుకోసం టీఎస్‌పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే లీకేజీ వ్యవహారాలతో సతమతమవుతున్న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.

TSPSC Group 4 Exam Halltickets: గ్రూప్‌-4 పరీక్ష హాల్‌ టికెట్లు విడుదల.. ఎప్పటివరకు అంటే..!

హైదరాబాద్‌: తెలంగాణలో జరగబోయే గ్రూప్-4 పరీక్ష హాల్ టికెట్లను టీఎస్‌పీఎస్సీ (TSPSC Group 4 Exam Halltickets) విడుదల చేసింది. జులై 1న గ్రూప్-4 ఎగ్జాయ్ జరగనుంది. ఇందుకోసం టీఎస్‌పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే లీకేజీ వ్యవహారాలతో సతమతమవుతున్న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.

జులై 1న ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్‌ -1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్‌-2 పరీక్షలు జరగనున్నాయి. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైటు నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభానికి 45 నిమిషాల ముందు వరకు కూడా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. చివరి నిమిషం వరకు వేచిచూడకుండా ముందుగానే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకుని నియమ, నిబంధనలను తెలుసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. జూలై 1న రెండు సెషన్లలో గ్రూప్‌- 4 పరీక్ష జరగనుండగా, 8,180 గ్రూప్‌- 4 ఉద్యోగాలకు 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Updated Date - 2023-06-24T14:11:31+05:30 IST